Ram Charan : తమ అభిమాన హీరో కి సంబంధించి ఎదో ఒక్క చిన్న పాజిటివ్ జరిగినా ఫ్యాన్స్ ఎంతగానో మురిసిపోతారు. అలాంటి ఫ్యాన్స్ ని ఈమధ్య నిర్మాతలు టార్చర్ చేసేస్తున్నారు. ముఖ్యంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ విషయం లో ఇది జరుగుతుంది. #RRR చిత్రం తో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపుని దక్కించుకొని గ్లోబల్ స్టార్ గా పేరు తెచ్చుకున్న రామ్ చరణ్, ఆ సినిమా తర్వాత వెంటనే ‘గేమ్ చేంజర్’ చిత్రాన్ని ప్రారంభించాడు.

ఈ సినిమా ప్రారంభించిన ఏడాదికి ఎన్టీఆర్ ‘దేవర’ చిత్రాన్ని ప్రారంభించి షూటింగ్ ని చివరి దశకి తీసుకొచ్చాడు. వచ్చే ఏడాది ఏప్రిల్ 4 వ తేదీన విడుదల చేయబోతున్నట్టు అధికారిక ప్రకటన కూడా చేసారు. కానీ ‘దేవర’ కంటే ముందే షూటింగ్ ని ప్రారంభించుకున్న ‘గేమ్ చేంజర్’ పరిస్థితి మాత్రం ఎటు కాకుండా పోయింది. వచ్చే ఏడాది లో కూడా ఈ సినిమా విడుదలయ్యే అవకాశాలు కనిపించడం లేదు.

ఇదంతా పక్కన పెడితే నేడు ఈ సినిమాకి సంబంధించిన ‘జరగండి..జరగండి’ అనే లిరికల్ వీడియో సాంగ్ ని విడుదల చెయ్యబోతున్నట్టు అధికారిక ప్రకటన చేసారు. కానీ ఇప్పటి వరకు ఆ సాంగ్ గురించి ఎలాంటి అప్డేట్ లేదు. సినిమా విడుదల తేదీ ఎప్పుడో తెలియదు, మొదటి లిరికల్ వీడియో సాంగ్ విడుదల చేస్తామని చెప్తారు కానీ చెయ్యరు.

ఇలాంటి టీం తో సినిమా చేసి ఫ్యాన్స్ రక్తం తాగేబదులు సినిమాలు ఆపేసి రిటైర్ అయిపోవచ్చు కదా అన్నా అంటూ రామ్ చరణ్ ని ట్యాగ్ చేసి ఫ్యాన్స్ పోస్టులు వేస్తున్నారు. పెద్ద ఎత్తున నెగటివ్ ట్రెండ్స్ కూడా చేస్తున్నారు, కానీ మూవీ టీం నుండి ఎలాంటి స్పందన లేదు. ఇలాగే ఫ్యాన్స్ ఎమోషన్స్ తో ఆడుకుంటే దిల్ రాజు ఆఫీస్ కి వచ్చి దాడి చేస్తాము అంటూ ఫ్యాన్స్ వార్నింగ్ ఇస్తున్నారు. ఫ్యాన్స్ కామెంట్స్ ని చూసి మూవీ టీం రెస్పాన్స్ ఇస్తుందో లేదో చూద్దాం.