ఫైమా అంటే గుర్తుకు పట్టడం కాస్త కష్టం కానీ..జబర్దస్త్ ఫైమా అంటే ఇట్టే గుర్తు పట్టేస్తారు. జబర్ధస్త్ కామెడీ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఫైమా బిగ్‌బాస్ రియాలిటీ షో పాల్గొని తెలుగు ప్రేక్షకులను అలరించింది. దాదాపు 10 వారాలకు పైగా ఆ షోలో ఉండి టాస్కుల్లో మిగతా కంటెస్టెంట్లకు గట్టి పోటీ ఇచ్చింది. తనదైన కామెడీతో ఆకట్టుకుంది.

బీడీలు చుట్టగా వచ్చిన డబ్బుతోనే తమని అమ్మ పెంచినట్లు పలు సందర్భాల్లో ఫైమా చెప్పింది. అమ్మకు ఓ మంచి ఇల్లు కట్టిఇవ్వాలనేదే తన డ్రీమ్ అని చాలా సార్లు చెప్పింది. అయితే.. ఎట్టకేలకు తన కలను నిజం చేసుకుంది. ఈ విషయాన్ని తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఫైమా తెలియజేసింది. తన కొత్తింటిల్లోకి అడుగుపెడుతున్న వీడియోను అభిమానులతో పంచుకుంది.

ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ఫైమాను పట్టుకుని ఆమె తల్లి కన్నీళ్లు పెట్టుకుంది. ఫైమా కొత్తింటి గృహ ప్రవేశ కార్యక్రమానికి జబర్దస్త్ బుల్లెట్ భాస్కర్, బిగ్ బాస్ ఫేమ్ ఆర్జే సూర్య తదితరులు హజరయ్యారు. ఇదిలా ఉంటే.. తన కో స్టార్ కమెడియన్ ప్రవీణ్‌తో ఫైమా ప్రేమలో ఉన్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.