Faima : కామెడీ మరియు రియాల్టీ షోస్ పుణ్యమా అని బుల్లితెరపై స్టార్స్ కి వస్తున్న గుర్తింపు అంతా కాదు. చిన్న షో తో స్టార్ట్ చేసి ఎందరో అభిమానులను సొంతం చేసుకుని బాగా పాపులర్ అయిన బుల్లితెర స్టార్స్ ఎందరో ఉన్నారు. ఫైమా కూడా అలాగే బుల్లితెర కమెడియన్ గా పరిచయమై విపరీతమైన క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. పట్టాస్ షో తో బుల్లితెరలో ఎంట్రీ ఇచ్చిన ఈ కమెడియన్ ఆ తర్వాత జబర్దస్త్ లో కూడా తనదైన స్టైల్ లో రెచ్చిపోయింది.

ముఖ్యంగా ఆమె వేసే డబల్ మీనింగ్ డైలాగ్స్ కు పెద్ద ఫ్యాన్ బేస్ ఉంది. వినడానికి కాస్త వల్గర్ గా ఉన్న ఆ టైంలో నవ్వడానికి పర్వాలేదు అని ఫీల్ అయ్యి అందరూ ఆమె పర్ఫామెన్స్ ను ఎగబడి చూస్తారు.ఈ నేపథ్యంలో ఫైమాకు సంబంధించిన ఓ న్యూస్ ఇప్పుడు వైరల్ అయింది.పటాస్ షో తో బాగా పాపులర్ అయిన ప్రవీణ్ – ఫైమ మధ్య ఎప్పటినుంచో నడుస్తున్న ప్రేమాయణం గురించి అందరికీ తెలిసిందే.

పెద్ద ఓపెన్ సీక్రెట్ అయిన వీళ్ళ లవ్ స్టోరీ ప్రత్యేకంగా డిస్కస్ కూడా చేయక్కర్లేదు. ఈ నేపథ్యంలో ఫైమా ఇన్స్టా లో పెట్టిన ఒక పోస్ట్ ప్రస్తుతం జనాల మైండ్ బ్లాక్ చేస్తోంది. తను లవర్తో విడిపోయానని అర్థం వచ్చేలా ఫైమా పెట్టిన పోస్ట్ తో పాటు వేరే పెళ్లి చేసుకోబోతున్నట్టు ఇంకొకరితో ఉన్న ఫోటోని కూడా షేర్ చేసింది.అయితే ఇదంతా నిజం కాదు కేవలం బేబీ మూవీ ఎఫెక్ట్ అని ఆ తర్వాత తెలిసింది.
బేబీ మూవీ లాగా చేసిన ఒక వీడియోకి ప్రమోషన్ లో భాగమే ఈ పోస్ట్ అని ఆ తర్వాత అందరికీ అర్థమైంది. ఏది ఏమైనాప్పటికీ పూలమాల వేసుకొని పెళ్లి చేసుకోబోతున్నట్లు వేరే వ్యక్తితో ఫైమా ఫోటో చూసి నిజంగానే ఇంకో పెళ్లి చేసుకుంటుందా అని ఆమె అభిమానులు షాక్ అయ్యారు. ఆ తర్వాత ఇదంతా ఫోటోషాప్ ద్వారా చేసిన ఒక ఎడిటింగ్ అని తెలుసుకొని ఊరట చెందారు.