Sridevi : అలనాటి అతిలోకసుందరి శ్రీదేవి కోట్లాదిమంది హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుంది. చిన్ననాటి నుంచే చైల్డ్ ఆర్టిస్ట్ గా నటిస్తూ సంపాదన మొదలుపెట్టిన శ్రీదేవి ఆర్థికపరంగా తన కుటుంబానికి ఎంతో సహాయపడింది. హీరోయిన్గా గుర్తింపు.. కెరీర్ కోసం ఎంతో కష్టపడిన శ్రీదేవి ఎప్పుడు డబ్బు సంపాదించే మిషన్లా పని చేసేది. ఆమె చనిపోయిన తరువాత కూడా ఇప్పటికీ ఆమె గురించి ఏదైనా వార్త వస్తే ఆసక్తిగా ప్రేక్షకులు చూస్తున్నారంటే ఆమె నటనతో తెచ్చుకున్న గుర్తింపు, ఆమె మంచితనమే దానికి కారణం. శ్రీదేవి ఎంత గొప్ప స్టార్ హీరోయిన్ అయినా వ్యక్తిగత జీవితంలో ఆమె ఎప్పుడూ పోరాటాలు చేస్తూనే వచ్చారు.
శ్రీదేవి తల్లి అనారోగ్య విషయంలో ఒక పోరాటం చేసింది. ఆ తర్వాత ఆమె తల్లి చనిపోవడంతో చెల్లితో ఆస్తి గొడవలపై కోర్టుకెక్కింది. తాను కష్టపడి సంపాదించుకున్న ఆస్తులు తాను దక్కించుకుంది. కానీ రెండో పెళ్లి వాడిని పెళ్లి చేసుకున్న శ్రీదేవి అప్పటికి కూడా ఏమి సుఖపడలేదు. ఎన్నో కష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. అత్తవారింట్లో సరైన గుర్తింపు లేక.. అక్కడ ఎన్నో అవమానాలు ఎదుర్కొంది. శ్రీదేవి రెండో పెళ్లి వాడైన బోని కపూర్ ని పెళ్లి చేసుకున్నందుకు బోనీకపూర్.. శ్రీదేవిని సంతోషంగా ఏమీ ఉంచలేదు. సినిమాలు తీసి అప్పుల పాలయ్యాడు. బోనికపూర్ కోసం చివరకు చెన్నై, హైదరాబాద్ లోని ఆమె ఆస్తులను కూడా అమ్మేసింది శ్రీదేవి.
ఇక ఇటీవల ఓ ఇంటర్వ్యూలో శ్రీదేవి పిన్ని భర్త ( బాబాయ్) మాట్లాడుతూ శ్రీదేవి చిన్నప్పటి నుంచి అందరికీ బాగా సంపాదించి పెట్టిందని.. కానీ ఆమె సంపాదించిన డబ్బే ఆమెకి మనశ్శాంతిని ఇవ్వలేక పోయిందని.. చిన్నతనంలో తల్లి ,తర్వాత చెల్లి, పెళ్లైన తర్వాత భర్త ఆమెను బ్రతికి ఉన్నంతకాలం ఎవరో ఒకరు పీక్కుతున్నారని వివరించాడు. చివరికి దుబాయ్ లో కూడా భోనితో గొడవపడి బాత్రూంలోకి వెళ్లిన శ్రీదేవి మందు తాగి జారి బాత్రూం లో పడి చనిపోయిందని.. ఇలా ఆమె బ్రతికున్నంత కాలం ఎన్నో బాధలను భరించిందని చెప్పుకొచ్చాడు. బోనికపూర్ కుటుంబం ఎప్పుడు శ్రీదేవి కుటుంబాన్ని దగ్గరకు రానివ్వలేదని.. బోనికపూర్ మాత్రం అప్పుడప్పుడు శ్రీదేవి కుటుంబంలో జరిగిన ఫంక్షన్స్ కు అటెండ్ అయ్యేవాడు అని తెలిపారు. ఇక శ్రీదేవి పిల్లలు కూడా తెలుగు రాకపోవడం వల్ల మాతో కలవరని.. ఎప్పుడు సరిగా మాట్లాడారని.. బాధపడ్డాడు శ్రీదేవి బాబాయ్.