అక్కినేని నాగచైతన్య, సమంత కొద్ది నెలల క్రితం విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట విడిపోవడం ఎంతటి సెన్సేషన్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే సమంతతో విడిపోయిన తర్వాత ఆమె ఫ్యాన్స్ చైతూపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. తాజాగా చైతూను చెన్నైలో సమంత అభిమానులు ఘోరంగా అవమానించారు. దీంతో నాగ చైతన్య చాలా కోపడ్డారట కూడా. ఇదంతా జరిగింది ఎక్కడ అనుకుంటున్నారా.. ఇటీవల కస్టడీ ట్రైలర్ లాంఛ్ లో జరిగింది. ఇప్పుడు ఇదే ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది.

ఈ ఈవెంట్ లో చైతు స్టేజ్ పై మాట్లాడుతుండగా.. ఆడియన్స్ లో ఒక గుంపుగా కూర్చున్న కొంతమంది సమంత.. సమంత అంటూ గట్టిగా నినాదాలు చేశారు. స్పీచ్ ఇస్తున్న చైతూను డిస్టబ్ చేసేందుకు సమంత ఫ్యాన్స్ తెగ ప్రయత్నించారు. అయినా సరే చైతు తన స్పీచ్ ఆపకుండా కంటిన్యూ చేశాడు. నిజానికి సోషల్ మీడియా లో వీళ్లిద్దరి అభిమానుల మధ్య వార్స్ నడుస్తూనే ఉంటాయి. ఇప్పుడు కూడా చైతూనే అవమానించేందుకు కస్టడీ ఈవెంట్ లో సామ్ ఫ్యాన్స్ అలా చేశారని నెట్టింట ప్రచారం జరుగుతోంది.

ఇక ఇటీవల సమంత తో విడాకులపై నాగ చైతన్య మాట్లాడిన విషయం తెలిసిందే. మా మధ్య ఏదైతే జరిగిందో అది దురదృష్టకరం. మేము విడిపోయినప్పుడు ఎన్నో వదంతులు వచ్చాయి. కొంతమంది గాసిప్స్ క్రియేట్ చేస్తూ వార్తలు రాశారు. వాటిని చూసి ఇబ్బందిపడ్డా. మా గురించి ఎందుకింతలా వార్తలు సృష్టిస్తున్నారు? టీఆర్పీ కోసం ఎందుకు ఇలా చేస్తున్నారు? ఇదంతా అవసరం లేదు కదా అనిపించింది. రోజులు గడిచే కొద్ది వాటిని పట్టించుకోవడం మానేశా. నేను పరిశ్రమలోకి వచ్చింది వృత్తిపరమైన జీవితంతో ప్రేక్షకులను అలరించడానికి.. వ్యక్తిగత జీవితంతో ఎంటర్‌టైన్ చేయడానికి కాదు. అలా, నా వృత్తిపై మరింత దృష్టి పెట్టి ముందుకు సాగుతున్నా అని చెప్పాడు.