Samantha చెప్పేవన్నీ అబద్ధాలే.. తన నిజస్వరూపం బయటపెట్టిన డాక్టర్

- Advertisement -

Samantha : ఇటీవల కాలంలో హీరోయిన్ సమంత హెల్త్ పాడ్ కాస్ట్ పేరిట.. చేస్తున్న వీడియోస్ ఎలా వైరల్ అవుతున్నాయో మనకు తెలిసిందే. ఆమె ఆ మధ్యకాలంలో మయోసైటిస్ అనే అరుదైన వ్యాధికి గురైన సంగతి తెలిసిందే. తన హెల్త్ పట్ల తాను ఎదుర్కొన్న పరిస్థితులను అందరికీ తెలిసేలా జనాలు తగిన జాగ్రత్తలు తీసుకునేలా. ఈ హెల్త్ పాడ్ కాస్ట్ ను మొదలు పెట్టింది. అయితే ఆ హెల్త్ పాడ్ కాస్ట్ వీడియోల్లో సమంత మాట్లాడిన మాటలకు సంబంధించి కొన్ని నెగిటివ్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి . ఇటీవల సమంత ఓ వీడియో చేసింది . యూట్యూబ్ పాడ్ కాస్ట్ పేరిట కొన్ని ఆరోగ్య చిట్కాలను అభిమానులతో పంచుకుంటుంది ఈ బ్యూటీ. ఆ సిరీస్ లో భాగంగా “అండర్స్టాండింగ్ ఆటో ఇమ్యూనిటీకి సంబంధించిన వీడియోను రిలీజ్ చేసింది”.

Samantha
Samantha

అయితే ఈ వీడియో పై ప్రముఖ డాక్టర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాడు. సమంత పాడ్ క్యాస్ట్ పై సంచలన కామెంట్స్ చేయడంతో పాటు ఆమె పై మండిపడ్డాడు. ‘డాండెలైన్ హెర్బ్ కాలేయ ఆరోగ్యానికి ఉత్తమ ఔషధమని.. సమంత చెప్పడం అస్సలు మంచిది కాదని.. అది సరైన పద్ధతి కాదు అని .. అవగాహన లేకుండా నోటికి వచ్చినట్లు తన ఫాలోవర్స్ ను పెంచుకోవడానికి తప్పు దోవ పట్టిస్తున్నారు” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ట్వీట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

- Advertisement -

అంతేకాదు సమంత అంటే ముందు నుంచి పడని వాళ్లు కూడా ఈ వార్తను బాగా ట్రెండ్ చేస్తున్నారు. స్టార్ హీరోయిన్ అయ్యుండి కూడా సమంత అందరిని చీట్ చేస్తుందంటూ ఫైర్ అవుతున్నారు. సమంత ఇండస్ట్రీలో మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయడానికి రెడీగా ఉంది . మంచి సినిమాలు వస్తే.. తప్పకుండా నటిస్తాను అంటూ డైరెక్టర్లకి చెప్పుకొస్తుందట. అయితే తెలుగు ఇండస్ట్రీ నుంచి పెద్దగా అవకాశాలు ఆమె దక్కించుకోకపోవడం గమనార్హం. బాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రం కుప్పలు తెప్పలుగా సమంతకు అవకాశాలు వస్తున్నాయి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here