టాలీవుడ్ లో ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ చనిపోయిన సంఘటన యావత్తు సినీ లోకాన్ని శోకసంద్రం లోకి నెట్టేసిన సంగతి తెలిసిందే, ఎప్పుడు ట్రెండింగ్ లి ఉండే రాకేష్ మాస్టర్ వారం రోజుల క్రితం కూడా యాక్టీవ్ గా వీడియోస్ చేస్తూ యూట్యూబ్ లో అప్లోడ్ చేసాడు.

తన తోటి యూట్యూబ్ సెలబ్రిటీస్ తో కలిసి ఒక ప్రోగ్రాం కొరకు ఉత్తరాంధ్ర కి వెళ్లి, అక్కడ నెల రోజుల పాటు షూటింగ్ చేస్తూ, మధ్య మధ్యలో మంచిగా ఎంజాయ్ చేస్తూ, ఆ వీడియోస్ ని అప్లోడ్ చేస్తూ వచ్చిన రాకేష్ మాస్టర్, రీసెంట్ గానే ఆ ప్రోగ్రాం ని ముగించుకొని హైదరాబాద్ కి చేరుకున్నాడు. ఇక్కడకి వచ్చిన తర్వాత ఆయన ఆరోగ్యం మొత్తం క్షీణించింది, వెంటనే సిటీ లోని గాంధీ హాస్పిటల్ కి తీసుకెళ్లి వైద్యం అందించారు, చికిత్స పొందుతూ ఉన్న రాకేష్ మాస్టర్ మధ్యలోనే తన తుది శ్వాసని విడిచిపెట్టాడు.

ఇది ఇలా ఉండగా రాకేష్ మాస్టర్ గతం లో మాట్లాడిన కొన్ని మాటలను మరియు ఇచ్చిన కొన్ని ఇంటర్వ్యూస్ ని సోషల్ మీడియా లో ఆయనని అభిమానించే వాళ్ళు అప్లోడ్ చేస్తూ రాకేష్ మాస్టర్ ని గుర్తు తెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా ఆయన ఢీ షో లో పార్టిసిపేట్ చేస్తున్న రోజుల్లో తన ప్రియా శిష్యుడు శేఖర్ మాస్టర్ గురించి మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు మరోసారి వైరల్ అవుతున్నాయి.

ఆయన మాట్లాడుతూ ‘అవకాశాలు లేక , సంపాదన లేక ఆకలితో అలమటించిన రోజులు చాలానే ఉన్నాయి. ఆ సమయం లో నాతో పాటు నడిచిన వాళ్ళు ఉన్నారు, మధ్యలోనే వదిలి వెళ్లిపోయిన వాళ్ళు ఉన్నారు. నేను బిడ్డలాగా భావించే నా ప్రియా శిష్యుడు శేఖర్ మాస్టర్ కి కూడా కొంతమంది మీ రాకేష్ మాస్టర్ తో కలిసి ప్రయాణం చేస్తే నీ జీవితం నాశనం అయిపోతుంది అని చెప్పినా కూడా నన్ను వదిలిపెట్టలేదు. ఆకలితో ఉన్న రోజుల్లో వాడి దగ్గర ఉన్నది కూడా నాకు సగం పంచి పెట్టేవాడు’ అంటూ ఆయన శేఖర్ మాస్టర్ గురించి ఎమోషనల్ గా చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారింది. శేఖర్ మాస్టర్ ఇప్పుడు ఇండియాలోనే మోస్ట్ డిమాండ్ ఉన్న కొరియోగ్రాఫర్ గా కొనసాగుతున్న సంగతి అందరికీ తెలిసిందే.