ఈ మధ్యకాలంలో సెలెబ్రిటీల తాలూకు పర్సనల్ విషయాలు కొన్ని ఊహించని షాకిస్తున్నాయి. మరీ ముఖ్యంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న సెలబ్రిటీ జోడీలు తమ బంధాన్ని కట్ చేసుకోవడం పలు చర్చలకు తావిస్తున్నాయి. సింగర్ కమ్ యాక్టర్ నోయల్ సీన్ – హీరోయిన్ ఎస్తర్ జోడీ కూడా అదే బాటలో వెళ్లారు. ఇక వీళ్లిద్దరూ విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. ఎస్తేర్ నొరోన్హా పెళ్లైన ఆరు నెలలకే భర్త నుండి విడాకులు తీసుకుంది. మరి తన భర్త ఎవరో కాదు ప్రముఖ సింగర్ నోయల్. వీరు ప్రేమించుకొని పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నప్పటికీ వారిద్దరి మధ్య ఎన్నో గొడవలు రావడంతో విడిపోయారు.

ఒకవైపు నోయల్ తన కెరియర్లో ఆగిపోకుండా సింగర్ గా తన వృత్తిలో సాగిపోతుండగా ఎస్తేర్ కూడా వరుస సినిమాలలో బిజీ బిజీగా ఉంది. ఆ మధ్య 69 సంస్కార్ కాలనీ అనే చిత్రంలో నటించింది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్ లో చాలా బిజీగా ఉంది. నోయెల్ తో విడిపోయిన తర్వాత నోయల్ తనపై ఎన్నో నిందలు వేస్తూ నన్ను బాడ్ చేసాడు అని చెప్పుకొచ్చిందిట ఎస్తేర్. అయితే నోయల్ బిగ్‌బాస్ షోకి వెళ్లిన తర్వాత విడాకుల సానుభూతిని నోయల్ వాడుకున్నాడు అంటూ కామెంట్లు చేసింది. ఇది పక్కన పెడితే ఎంతో నరకాన్ని చూపించాడు అంటూ చెప్పుకొచ్చిందిట.

ఇంకా నన్ను ఎన్ని రకాలుగా వాడుకోవాలో అన్ని రకాలుగా వాడుకొని వదిలేశాడు అంటూ . నోయెల్ ఒకఎమోషనల్ అయిందిట. క్రూర మృగం అంటూ అతి దారుణంగా కామెంట్లు చేసిందని టాక్. నోయెల్ వల్ల తాను ఎన్నో ఇబ్బందులు పడాల్సి వచ్చింది అంటూ వెల్లడించినట్లు సమాచారం. ఇక నోయెల్ క్రియేట్ చేసిన చెడు ప్రభావంతో తనపై పెద్ద ఎత్తున ట్రోల్స్ జరిగాయని ఎస్తేర్ చెప్పింది.
అంతా నాదే తప్పు అనుకున్నారని, ఓ వ్యక్తి అయితే ఏకంగా హైదరాబాద్ వస్తే యాసిడ్ పోస్తా అని హెచ్చరించాడని ఎస్తర్ తెలిపింది. దీంతో ఈ విషయాలు జనాల్లో హాట్ ఇష్యూ అయ్యాయి. విడాకులు తీసుకున్న సమయంలో కొందరు మేమున్నామనే ధైర్యం ఇచ్చారని తెలిపింది ఎస్తేర్. విడాకులు తీసుకుని మంచి పనే చేసానని, ప్రస్తుతం చాలా సంతోషంగా ఉన్నానని చెప్పుకొచ్చింది ఈ సినీ నటి.