Junior NTR ఘోరమైన ప్రమాదం నుండి తప్పించుకున్న జూనియర్ ఎన్టీఆర్..క్షణాల్లో ప్రాణగండం తప్పింది!

- Advertisement -

Junior NTR నేటి తరం స్టార్ హీరోలలో మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ కి పర్యాపడం లాంటి హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్. నూనూగు మీసాలు కూడా లేని వయస్సులోనే ఇండస్ట్రీ ని షేక్ చేసి సూపర్ స్టార్ స్టేటస్ ని దక్కించుకున్న ఈ స్టార్ హీరో నేడు #RRR చిత్రం తో ప్రపంచాన్ని ఊపేసిన సంగతి మన అందరికీ తెలిసిందే. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అంటే కేవలం తెలుగు హీరో కాదు, పాన్ వరల్డ్ హీరో.

ఈయన కోసం ఇప్పుడు బాలీవుడ్, హాలీవుడ్ మేకర్స్ క్యూలు కట్టేస్తున్నారు. ఇకపోతే ఎన్టీఆర్ కి మొదటి నుండి జపాన్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అనే విషయం మన అందరికీ తెలుసు. రీసెంట్ గా ఆయన తన భార్యాపిల్లలతో కలిసి జపాన్ టూర్ కి వెళ్ళాడు. అక్కడ నిన్న ఏ రేంజ్ లో భూకంపాలు వచ్చాయో మన అందరం టీవీలలో చూస్తూనే ఉన్నాం.

ఆ భూకంపం కి సంబంధించిన ఫోటోలు మరియు వీడియోలు చూస్తే కన్నీళ్లు ఆగవు. ఎంతో మంది అమాయకులు ఈ భూకంపం లో చనిపోయారు. అయితే దీనిపై జూనియర్ ఎన్టీఆర్ తన ట్విట్టర్ ఖాతాలో స్పందించాడు. ఆయన మాట్లాడుతూ ‘జపాన్ పర్యటన నుండి నేడే నేను ఇంటికి తిరిగి వచ్చాను. కానీ వచ్చిన తర్వాత అక్కడ వచ్చిన భూకంపాలు, దానికి సంబంధించిన విజువల్స్ చూసి తీవ్రమైన దిగ్బ్రాంతికి గురి అయ్యాను. గత వారం రోజుల నుండి నేను జపాన్ లోనే ఉన్నాను. అక్కడి ప్రజలతో కలిసి తిరుగుతూ, వాళ్లలో మమేకం అయ్యాను..అలాంటి వారు నేడు ఇంతటి ఉపద్రవాన్ని ఎదురుకున్నారు అని తెలిసి చింతుస్తున్నాను. జపాన్ ప్రజలు త్వరగా కోలుకోవాలి’ అంటూ ఎన్టీఆర్ ఒక ట్వీట్ వేసాడు.

- Advertisement -

ఈ ట్వీట్ బాగా వైరల్ అయ్యింది. దేవుడి దయవల్ల, మా అందరి అభిమానం కారణంగా ఈరోజు నువ్వు మా ముందు ఉన్నావ్ అన్నయ్య, ఒక్క రోజు ఆలస్యం అయ్యి ఉంటే, నువ్వు కూడా భూకంపం కారణంగా ఇబ్బందులకు గురి అయ్యేవాడివి, పెద్ద ప్రాణ గండం నుండి తప్పించుకున్నావు అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here