Big Boss : బిగ్ బాస్ హౌస్ నుండి తేజా అవుట్..సీక్రెట్ రూమ్ కి అమర్ దీప్..వీకెండ్ లో ట్విస్టుల మీద ట్విస్టులు!

- Advertisement -

Big Boss : ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లో ఎలిమినేషన్స్ ఎవ్వరి ఊహలకు అందని విధంగా ఉంటున్నాయి. గత వారం లో సందీప్ మాస్టర్ ఎలిమేషన్ అందరికీ పెద్ద షాక్. టాస్కులన్నీ అంత అద్భుతంగా ఆడుతున్న సందీప్ ఎలిమినేట్ అవ్వడం పై అటు హౌస్ లో కానీ, బయట జనాల్లో కానీ తీవ్రమైన అసంతృప్తి నెలకొంది. ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుండి శోభా శెట్టి ఎలిమినేట్ అవుతుందని అందరూ అనుకున్నారు. ఎందుకంటే సోషల్ మీడియా లో అన్నీ ఓటింగ్స్ అలాగే ఉన్నాయి.

Big Boss
Big Boss

ఇన్ని రోజులు ఎలిమినేషన్స్ సోషల్ మీడియా ఓటింగ్స్ ఫలితాలకు చాలా దగ్గరగానే ఉంటూ వచ్చాయి. కానీ ఈ వారం మాత్రం అందుకు పూర్తి విరుద్ధం అట. అందుతున్న సమాచారం ప్రకారం ఈ వారం టేస్టీ తేజా బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. గడిచిన మూడు వారాల్లో సిల్లీ నామినేషన్స్ కి పెట్టింది పేరు లాగ నిలిచాడు టేస్టీ తేజా.

అతను వేసిన సిల్లీ నామినేషన్ వల్లనే నయనీ పావని ఎలిమినేట్ అయ్యింది. ఆ మరుసటి వారం పూజా ని కూడా ఇలాగే సిల్లీ నామినేషన్ తో బయటకి పంపాడు. గత వారం సందీప్ ఎలిమినేషన్ కూడా అలాంటిదే. ఈ వారం అలాంటి దరిద్రంగా సిల్లీ రీజన్ తోనే అర్జున్ ని నామినేట్ చేసాడు. కానీ అతను ఎలాగో ఎలిమినేట్ అవ్వడు అనుకోండి అది వేరే విషయం.

- Advertisement -

అలా సిల్లీ నామినేషన్స్ తో స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ని బయటకి పంపిన టేస్టీ తేజా, అదే సిల్లీ నామినేషన్ కారణంగా ఇప్పుడు ఆయన హౌస్ నుండి బయటకి వెళ్లబోతున్నాడు. మరో షాకింగ్ న్యూస్ ఏమిటంటే, హౌస్ లో టాప్ 3 కంటెస్టెంట్స్ లో ఒకరిగా నిల్చిన అమర్ దీప్ ని సీక్రెట్ రూమ్ లోకి పంపబోతున్నట్టు తెలుస్తుంది. ఈ సీజన్ లో గౌతమ్ ఒకసారి సీక్రెట్ నామినేషన్ లోకి వెళ్లి వచ్చాడు, ఆయన తర్వాత అమర్ దీప్ కి కూడా ఈ వారం ఛాన్స్ ఉందని టాక్ వినిపిస్తుంది, చూడాలి మరి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here