Eesha Rebba : ఈషా రెబ్బా.. టాలీవుడ్ లో ఈ భామ రూటే సపరేట్. ఈ తెలుగందం తన అందం, నటనతో సినిమాల్లో రాణిస్తోంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటోంది. తాజాగా ఈషా ఆరెంజ్ అండ్ బ్లూ కలర్ కలంకారీ బ్లౌస్ లో ఫొటోలు పోస్టు చేసింది. ఆరెంజ్ కలర్ ప్లెయిన్ శారీ పైన బ్లూ అండ్ రెడ్ కలర్ కలంకారీ బ్లౌజుతో భలే చూడముచ్చటగా కనిపించింది. ఇక ఈ ఫొటోల్లో తన నాజూకు అందాలన్నీ చూపిస్తూ హల్ చల్ చేసింది.

చీరకట్టులో ఈషా చాలా అందంగా కనిపించింది. కిటికీ వద్ద నిల్చొని తన సన్నజాజి నడుం చూపిస్తూ ఇచ్చిన పోజు అయితే ఈ ఫొటోషూట్ కే హైలైట్. ఇక కిటికీ వద్దే కూర్చొని నొసలు పైన చేయి పెట్టి ముసిముసి నవ్వు నవ్విన పోజు చూసి కుర్రాళ్లు ఫిదా అయ్యారు. ఇక ప్రకృతిని ఆస్వాదిస్తున్నట్టు కనిపించిన ఫొటోలో ఈషా ముఖం చాలా ప్రశాంతంగా కనిపించింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట తెగ ట్రెండ్ అవుతున్నాయి.
ఎంతైనా అమ్మాయిలు.. చీరకట్టులో కనిపించినంత అందం ఇంకెందులోనూ ఉండదు భయ్యా అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మరికొందరేమో ఎంతైనా మన తెలుగమ్మాయిల అందమే వేరు భయ్యా.. ఎంత మందిలో ఉన్నా.. ఇట్టే వెలిగిపోతారంటూ ప్రేమ కురిపిస్తున్నారు. ఇక ఇంకొందరైతే.. ఏదో టైంపాస్ కు హాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్లను చూస్తాం.. కానీ రోజూ బిర్యానీ తినగలమా.. మనకు ఈషా లాంటి ఆవకాయి ముద్దపప్పే బెటర్ ఆప్షన్ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
ఇక ఈషా సినిమాల సంగతికి వస్తే ఈ భామ అంతకుముందు ఆ తర్వాత అనే చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమలో అరంగేట్రం చేసింది. ఆ తర్వాత అమీతుమీలో అలరించింది. ఈ రెండు సినిమాలు ఈషా కెరీర్ లో ది బెస్ట్ అని చెప్పొచ్చు. ఇంకా హను-మాన్ ఫేం ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన అ చిత్రంలోనూ ఈ భామ నటించింది.
ఇలా ఈషా రెబ్బా లో మంచి క్యాలిబర్ ఉన్న నటి ఉన్నా.. తెలుగులో ఈ భామకు పెద్దగా చెప్పుకునే అవకాశాలేం రావడం లేదు. కానీ ఈ మధ్య తమిళ సినిమా ఇండస్ట్రీ ఈ బ్యూటీ టాలెంట్ ను గుర్తించి అవకాశాలు ఇస్తోంది. ఏదైనా తెలుగు సినిమా పరిశ్రమ ఇలాంటి టాలెంటెడ్ నటిని కోల్పోతుందని ఫ్యాన్స్ తెగ బాధ పడిపోతున్నారు.