సీతారామం సినిమాతో టాలీవుడ్‌లో క్రేజ్ దక్కించుకున్న హీరో దుల్కర్ సల్మాన్. ప్రస్తుతం బాలీవుడ్‌తో పాటు మలయాళ సినిమాలతో బిజీగా ఉన్నారు. ‘కింగ్ ఆఫ్ కోతా’ అంటూ అభిమానులను పలకరించేందుకు సిద్ధమయ్యారు. అంతే కాకుండా దుల్కర్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన వెబ్ సిరీస్ గన్స్ అండ్ గులాబ్స్ ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రస్తుతం ఈ సిరీస్ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

ప్రస్తుతం కింగ్ ఆఫ్ కోత మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్న దుల్కర్ ఓ ఇంటర్వ్యూకు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా మహిళ అభిమానులు తన పట్ల వ్యవహరించిన తీరుపై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఒక మహిళా అభిమాని తనను అనుచితంగా తాకిందని వెల్లడించారు. ‘‘ఓకే కన్మని’, ‘సీతారామం’ తర్వాతే నాకు కేరళలో లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. సాధారణంగా నాకు బాయ్స్‌లో ఎక్కువ మంది అభిమానులు ఉంటారు. నేను ఎప్పుడూ వాళ్లతో టచ్‌లో ఉంటా. అభిమానుల వల్ల ఇబ్బందిపడిన సందర్భాలు కూడా కొన్ని ఉన్నాయి.

కొంతమంది మహిళలు ఫొటో తీసుకుంటానంటూ బుగ్గపై ముద్దు పెట్టాలని చూస్తుంటారు. వాళ్ల ప్రవర్తనతో ఆశ్చర్యపోయా. గతంలో ఒక పెద్దావిడ వల్ల నేను ఎంతో ఇబ్బంది పడ్డా. ఆమె నన్ను అభ్యంతరకరంగా తాకింది. నాకు ఎంతో బాధనిపించింది’’ అని ఆయన చెప్పారు. తన పెళ్లి గురించి మాట్లాడుతూ.. ‘‘28 ఏళ్ల వయసులోనే నాకు పెళ్లైంది. అమాల్ సోఫియా, నేనూ ఒకే స్కూల్‌లో చదువుకున్నాం. తనని కలిసినప్పుడే అర్థమైంది ఆమె నా జీవితం, కుటుంబంలో భాగమని. అంతకు ముందు ఏ అమ్మాయిని చూసినా నాకు ఆ భావన కలగలేదు. పెళ్లి, కెరీర్.. నాకు ఒకే సమయంలో మొదలయ్యాయి. పెళ్లైన కొద్దిరోజుల్లోనే రెండో సినిమా షూట్‌లో పాల్గొన్నా. షూట్స్‌తో ఎప్పుడూ బిజీగా ఉండే నేను.. ఏ కాస్త సమయం దొరికినా తనతో గడపటానికి ఇష్టపడుతుంటా’’ అన్నారు.