Kamal Hassan : తెలుగు చిత్రపరిశ్రమలో నటిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా డబ్బింగ్ జానకికి ఊహించని రేంజ్ లో పాపులారిటీ ఉందన్న విషయం తెలిసిందే. తాను 1000 కంటే ఎక్కువ సినిమాలలో నటించినట్లు జానకి పలుమార్లు తెలిపారు. ఒక్కో సమయంలో తినడానికి తిండి లేక నూకలు పిల్లలకు పెట్టిన సందర్భాలు సైతం ఉన్నాయని ఆమె ఆవేదన చెందారు. ఇతరుల దగ్గర ఏమీ లేనట్టు నిలబడకూడదని భావించే వాళ్లమని డబ్బింగ్ జానకి కామెంట్లు చేశారు. నా ఉద్దేశం ఏంటంటే ఎవ్వరినీ అప్పు అడగకూడదని భావించానని ఆమె పేర్కొన్నారు. నాకు ఇండస్ట్రీలో సపోర్ట్ గా ఎవరూ లేరని నా కష్టంతో నేను ఎదిగానని ఆమె పలు ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చారు. డైరెక్టర్స్ ఇళ్లకు వెళ్లి ఛాన్స్ అడిగేదానినని ఆమె కామెంట్లు చేశారు. నేను ఎవరితో క్లోజ్ గా ఉండనని.. నా పని నేను చూసుకుంటానని డబ్బింగ్ జానకి అభిప్రాయం వ్యక్తం చేశారు.
సినిమా ఇండస్ట్రీలో సావిత్రి అంటే తనకు ఎంతో ఇష్టమని, ఆమె వేసిన పాత్రలు తనకు ఎంతో నచ్చుతాయని డబ్బింగ్ జానకి తెలిపారు. సాగర సంగమం సినిమా గురించి ఆమె ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. దర్శకుడు కె.విశ్వనాథ్ గారితో 17 సినిమాలు చేశానన్నారు. ఓ సినిమాలో ఒక సీన్ కోసం కమల్ హాసన్ కాళ్ల మీద ఏడ్చాడని.. ఆ సమయంలో కొంతమంది కమల్ హాసన్ తన కాళ్ల మీద పడటం ఏంటని అన్నారని డబ్బింగ్ జానకి చెప్పుకొచ్చారు. కొంతమందికి ఇగోస్ ఉంటాయని కానీ కమల్ మాత్రం ఆ సీన్ ను సీన్ లా చేసి అందరి కంట కన్నీరు పెట్టించారని డబ్బింగ్ జానకి వెల్లడించారు. సీన్ లో పాల్గొంటున్నామంటే అక్కడ కమల్, డబ్బింగ్ జానకి కాదని పాత్రలు మాత్రమే ఉంటాయని ఆమె అన్నారు. డబ్బింగ్ జానకి వెల్లడించిన విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం డబ్బింగ్ జానకికి ఎక్కువగా సినిమా ఆఫర్లు అయితే రావడం లేదని తెలుస్తోంది.