కోట్లాది మంది అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన బిగ్ బాస్ 7 లేటెస్ట్ సీజన్ ఈమధ్యనే గ్రాండ్ గా ప్రారంభమైన సంగతి అందరికీ తెలిసిందే. ఎన్నడూ లేని విధంగా ఈ సీజన్ లో సరికొత్త పద్ధతులు, రూల్స్ ని ప్రవేశ పెట్టాడు బిగ్ బాస్. గత సీజన్స్ లో రెండు మూడు రోజులు గడిస్తే కానీ ఆటలు కష్టతరమైనవి ఉండేవి కాదు. కానీ ఈ సీజన్ లో మాత్రం మొదటి రోజు నుండే కంటెస్టెంట్స్ కి చుక్కలు చూపిస్తున్నాడు బిగ్ బాస్.
ఇంట్లో ఉండే ప్రతీ వస్తువు పోరాడి గెలవాల్సిందే. ఫర్నిచర్ అయినా, బెడ్ అయినా ఇలా ఏదైనా సరే పోరాడి గెలవాల్సిందే. అందుకే ఆట మొదటి రోజు నుండే రసవత్తరంగా సాగడం మొదలైంది. ఇక మొదటి వారానికి సంబంధించిన నామినేషన్ ప్రక్రియ నిన్న విన్నూతన రీతిలో జరిగింది. అప్పుడే కంటెస్టెంట్స్ మధ్య ఈ నామినేషన్ విషయం లో గొడవలు మొదలయ్యాయి.
ఈ మొదటి వారం లో నామినేషన్స్ కి వచ్చిన ఇంటి సభ్యులు పల్లవి ప్రశాంత్, రతికా రోజ్, శోభా శెట్టి, ప్రిన్స్ యావర్ , షకీలా, గౌతమ్ కృష్ణ, కిరణ్ రాథోడ్ మరియు దామిని. వీరిలో పల్లవి ప్రశాంత్ అత్యధిక ఓట్లతో నెంబర్ 1 స్థానం లో కొనసాగుతున్నాడు. ఆ తర్వాత రతికా రోజ్, శోభా శెట్టి , గౌతమ్ కృష్ణ, షకీలా మరియు దామిని కొనసాగుతున్నారు.
ఇక చివరి రెండు స్థానాల్లో ప్రిన్స్ యావర్ మరియు కిరణ్ రాథోడ్ కొనసాగుతుండగా, ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండే అవకాశం మెండుగా ఉంది కాబట్టి వీళ్లిద్దరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. అయితే ఇంకా నాలుగు రోజుల సమయం ఉంది, కచ్చితంగా ఈ గ్రాఫ్ రాబొయ్యే రోజుల్లో మారొచ్చు, కాబట్టి ముందుగానే వీళ్లిద్దరు ఎలిమినేట్ అయ్యిపోతారని చెప్పలేము కానీ, ప్రస్తుతానికి అయితే వీళ్లిద్దరు డేంజర్ జోన్ లోనే ఉన్నారు.