Niharika : పవన్ కళ్యాణ్ పై నిహారిక మాజీ భర్త సంచలన వ్యాఖ్యలు.. మండిపడుతున్న జనాలు

- Advertisement -

Niharika : ఏపీలో ఎన్నికలకు మరో మూడు రోజుల సమయం మాత్రమే ఉంది. దీంతో అన్ని పార్టీల నాయకులు ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సారి ఎన్నికల ప్రచారంలో పలువురు సినీ సెలబ్రిటీలు సైతం పాల్గొని సందడి చేస్తున్న విషయం తెలిసిందే. అయితే జనసేన పార్టీకి టాలీవుడ్ స్టార్ హీరోలు సపోర్ట్ చేస్తూ పలు పోస్టులు కూడా పెడుతున్నారు. ఈ క్రమంలోనే నిహారిక మాజీ భర్త ఓ ఇంటర్వ్యూలో పాల్గొని సంచలన వ్యాఖ్యలు చేశారు. నిహారిక మాజీ భర్త జొన్నలగడ్డ చైతన్య జనసేన పార్టీపై, పవన్ కల్యాణ్‌ ఊహించని విధంగా కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. చైతన్య మాట్లాడుతూ.. జనసేన పార్టీకి ఎవరూ ఓటు వేయకండి. స్వార్థ రాజకీయాల కోసం మెగా ఫ్యామిలీ ఎంతకైనా దిగజారుతారు. జనసేన సిద్ధాంతాలు పవన్ కల్యాణ్ కూడా పాటించడు. ఆయన మాట్లాడే మాటలకు చేతలకు ఏ మాత్రం పోలిక ఉండదు.

అలాగే జనసేనాని పవన్ కల్యాణ్ తరపున పలువురు సెలబ్రిటీలు పిఠాపురంలో ప్రచారం నిర్వహిస్తున్నారు. కానీ వారంతా పవన్ కల్యాణ్ అంటే భయం తోనే ప్రచారం చేస్తున్నారు. దానికి కారణం.. ప్రచారానికి రాకపోతే అవకాశాలు రావని ఆర్టిస్టులను పవన్ కళ్యాణ్ భయపెట్టడంతో తప్పని సరి పరిస్థితుల్లో వస్తున్నారు. జనసేనను నమ్మి ఎంతో మంది మోసపోయారు.. పోతున్నారు. మోస పోతారు. జనసేన అధ్యక్షుడు చంద్రబాబు చెప్పినట్లు వింటున్నాడు’’ అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం జొన్నలగడ్డ చైతన్య కామెంట్స్ నెట్టింట్లో సంచలనం అవుతున్నాయి. ఈ వార్తల్లో నిజమెంత అనేది తెలియనప్పటికీ చైతన్య కామెంట్స్ గురించి తెలుసుకున్న మెగా అభిమానులు మాత్రం మండిపడుతున్నారు.

- Advertisement -

కాగా.. మెగా డాటర్ నిహారిక, జొన్నలగడ్డ చైతన్య 2020లో రాజస్థాన్ ఉదయ్ పూర్‌లో గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నారు. కానీ వీరి సంసారం ఎక్కువ కాలం సాగలేదు. పెళ్లి అయిన కొద్ది రోజులకే నిహారిక, చైతన్య మధ్య మనస్పర్థలు రావడంతో 2023లో డివోర్స్ తీసుకుని విడిపోయారు. ఇక అప్పటి నుంచి నిహారిక సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడంతో పాటు.. నిర్మాతగా ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసి పలు చిత్రాలు తెరకెక్కిస్తోంది. అంతేకాకుండా తన ఫ్రెండ్స్ ఫ్యామిలీతో వెకేషన్స్‌కు వెళ్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. అలాగే సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటూ పలు పోస్టులను పెడుతుంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here