జ్యోతిష్యులు Venu Swamy.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు..ఈ మధ్య ఈయన పేరు సినీ ఇండస్ట్రీలో, సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. ఈయన నోటి నుంచి ఏది వచ్చిన సంచలనమే.. అయితే ఇప్పుడు ఈయన గురించి కొన్ని వార్తలు గుప్పుమంటున్నాయి.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో వేణుస్వామి మాట్లాడుతూ తన ఆహారపు అలవాట్ల గురించి షాకింగ్ విషయాలను వెల్లడించారు.. అది కాస్త చర్చనీయాంశంగా మారింది..ఆయన నాన్ వెజ్ తిన్నట్లు ఆయనే స్వయంగా చెప్పడం అందరిని ఆలోచనలో పడేసింది..

విషయానికొస్తే..రాంచీలో రాజ్ రప్ప టెంపుల్ ఉంటుందని ఆ ఆలయంలో అమ్మవారికి మేక దానితో అభిషేకం చేస్తారని ఆయన తెలిపారు. అక్కడ అమ్మవారికి నైవేద్యం పెట్టి నాకు మూడు కిలోల మటన్ ఇచ్చారని వేణుస్వామి చెప్పుకొచ్చారు. ఆ మటన్ ను నేను బస చేసిన రిసార్ట్ లో ఇవ్వగా పాలకూర పప్పులో మటన్ వేసి వండాడని ఆ మటన్ నేను మూడు ముక్కలు తిన్నానని ఆయన తెలిపారు. నేను నాన్ వెజ్ తింటానని, తినకూడదని శాస్త్రం లేదు కదా అనివేణుస్వామి ఆయన అనడం సంచలంగా మారింది… కొన్ని దేవాలయాల్లో నాన్ వెజ్ ప్రసాదంగా ఇస్తారని ఆయన తెలిపారు.
అప్పట్లో ఒక అమ్మాయి విడాకులు తీసుకుంటే పది ఊర్లు మాట్లాడుకునేవారు.. కానీ ఇప్పుడు అది కామన్ అయ్యిందనే ఆయన అన్నారు.. గతంలో పార్టీ మేనిఫెస్టో అంటే భగవద్గీత అని ఇప్పుడు దానిని ఎవరూ పాటించడం లేదని ఆయన తెలిపారు. ఇప్పుడు అమ్మాయిలు కూడా సిగరెట్లు తాగుతున్నారని ఆయన పేర్కొన్నారు.. ప్రస్తుత ట్రెండ్ కు తగ్గట్లు మారాలని ఆయన చేసిన పనిని కవర్ చేసాడు.. రష్మికకు పూజ చేసిన సమయంలో విమర్శలు చేశారు.. కానీ రష్మిక హైదరాబాద్ ఇంట్లో ఉన్న సమయంలో పూజలు చేశామనిఆయన తెలిపారు. రష్మిక,రక్షిత్ జాతకం బాలేదని చెప్పి విడిపోవాలని సూచించానని ఆయన పేర్కొన్నారు. రష్మిక లోక్ సభ ఎంపీ అవుతారని నేను చెప్పానని ఆయన తెలిపారు. చాలామంది హీరోయిన్లకు పూజలు చేశామని ఆయన అన్నారు.. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. ఒక దైవ దూతగా ఉన్న ఆయన ఇలా మాంసం తినడం పై పెద్ద ఎత్తున చర్చలు జరుతున్నాయి.. మరి దీనిపై వేణుస్వామి ఎలా వివరణ ఇస్తారో చూడాలి..