Jr. NTR- Mamitha Baiju : జూ.ఎన్టీఆర్ ప‌క్క‌న ప్రేమ‌లు బ్యూటీ ఆ.. నిజమైతే లక్కీ నే..

- Advertisement -

Jr NTR- Mamitha Baiju : జూ.ఎన్టీఆర్ కు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న క్రేజ్ అండ్ ఫ్యాన్ బేస్ గురించి.. ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ హీరోతో జత కట్టాలంటే .. హీరోయిన్స్ కు రాసి పెట్టి ఉండాలని అంతా అనుకుంటూ ఉంటారు. అందుకే ఈ హీరోతో కలిసి నటించడం కోసం చాలా మంది హీరోయిన్స్ ఎదురు చూస్తూ ఉంటారు. కానీ,.. నిన్న మొన్న సైలెంట్ గా డబ్బింగ్ సినిమాతో తెలుగు వారికి పరిచయం అయినా.. మమిత బైజుకు మాత్రం ఈ అదృష్టం వెంటనే లభించిందని.. తారక్ తో కలిసి హీరోయిన్ గా నటించే ఛాన్స్ మమితకు దక్కిందనే టాక్ మొదలైంది.

మమితకు అటు యాక్టింగ్ తో పాటు, ఇటు డ్యాన్స్ కూడా బాగానే వచ్చు. సో ప్రేమలు తో అందరిని కట్టిపడేసింది. కాబట్టి ఆమెకు వరుస ఆఫర్లు వస్తున్నాయి. అయితే, ఇప్పుడు ఎన్టీఆర్ నటిస్తున్న వార్-2 సినిమాలో తారక్ కు జోడిగా ఓ సౌత్ హీరోయిన్ కావాలి. సరిగా ఇదే సమయానికి మమితకు క్రేజ్ పెరగడంతో.. వార్-2 సినిమాలో నటించేందుకు.. మమిత బైజును సెలెక్ట్ చేశారంటూ టాక్ వినిపిస్తోంది.

- Advertisement -

మరి, ఒకవేళ ఈ న్యూస్ కనుక నిజమైతే.. వార్ -2 సినిమాతో మమిత క్రేజ్ .. ఇంకా పెరిగిపోతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే, ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబినేషన్ అంటే చాలా పెద్ద డీల్. వరల్డ్ వైడ్ గా ఈ సినిమాపై అందరికి భారీ అంచనాలు ఉన్నాయి. దాదాపు ఈ సినిమాలో నటించేవారంతా పెద్ద స్టార్స్ ఏ ఉన్నారు. సో నిన్న మొన్న వచ్చిన మమిత బైజును వార్-2 లో ఎందుకు తీసుకుంటారు! అని ఓ వర్గం ప్రేక్షకులు భావిస్తున్నారు.

కానీ, దర్శకుడు అయాన్ ముఖర్జీ మాత్రం ఎన్టీఆర్ కు జోడిగా మమిత బావుంటుందని అనుకున్నాడట. పైగా వీరిద్దరి జోడి అందరికి ఫ్రెష్ గా కనిపిస్తుందని భావిస్తున్నాడట దర్శకుడు. ఈ విషయమై మూవీ మేకర్స్ నుంచి పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది. ఒక వేళ మమిత ఎన్టీఆర్ ప‌క్క‌న న‌టించిందే అనుకుంటే.. ఆ క్రేజ్ మామూలుగా ఉండ‌దు. ఆఫ‌ర్ వ‌చ్చిందంటే మ‌మిత కు పండ‌గ అనే చెప్పాలి. దీనిపై ప్రేమ‌లు హీరోయిన్ కూడా స్పంద‌న లేదు. అయితే ఈ మూవీలో ఛాన్స్ వ‌స్తే మంచిదే.. మ‌రి చూద్దాం. మ‌మిత‌కు ఆ ల‌క్ ఉందో లేదో మ‌రి..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here