Pawan Kalyan – సౌందర్య కాంబినేషన్ లో వచ్చిన ఈ షార్ట్ ఫిల్మ్ లవ్ స్టోరీ గురించి ఎవరికైనా తెలుసా?

- Advertisement -

Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి అభిమానులకు తెలియని విషయం ఏముంటుంది చెప్పండి. ఆయన జీవితం అభిమానులకే కాదు, అందరికీ తెరిచినా పుస్తకం లాంటిది. కానీ పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టక ముందు జరిగిన కొన్ని విషయాల గురించి ఎవరికీ తెలియదు. వాటి గురించే ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. ముందుగా పవన్ కళ్యాణ్ సత్యానంద్ అనే వ్యక్తి దగ్గర నటన మరియు దర్శకత్వం నేర్చుకున్న సంగతి అందరికీ తెలిసిందే.

Pawan Kalyan
Pawan Kalyan

తన గురువు సత్య దేవ్ అంటే పవన్ కళ్యాణ్ కి ఎంతో భక్తి. ఫిలిం ఇన్స్టిట్యూట్ లో కోర్స్ తీసుకుంటున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ మీద కొన్ని షార్ట్ ఫిలిమ్స్ ని చిత్రీకరించాడు సత్య నంద్. ఈ షార్ట్ ఫిలిమ్స్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా లో చాలానే ఉన్నాయి. అయితే ఈరోజు సోషల్ మీడియా లో లీక్ అయినా ఒక ఫోటో అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

Pawan Kalyan Young Photos

ఈ ఫోటో లో పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్న అమ్మాయి మరెవరో కాదు, సౌందర్య గారే. ఈమె కూడా పవన్ కళ్యాణ్ తో పాటుగా సత్యానంద్ దగ్గర యాక్టింగ్ కోర్స్ చేసింది. సౌందర్య 1993 వ సంవత్సరం లో సినీ రంగం లోకి అడుగుపెట్టింది. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం 1997 లో ఇండస్ట్రీ కి వచ్చాడు. వీళ్లిద్దరు కలిసి ఒక్క సినిమాలో కూడా నటించకపోయిన, సత్యానంద్ ఫిలిం ఇన్స్టిట్యూట్ లో ఒక షార్ట్ ఫిలిం లో నటించారు. దానికి సంబంధించిన ఫోటోనే మీరంతా చూస్తున్నది.

- Advertisement -
Pawan Kalyan Sowndarya

పవన్ కళ్యాణ్ మరియు సౌందర్య కాంబినేషన్ లో అప్పట్లో ‘సుస్వాగతం’ అనే చిత్రం తెరకెక్కాల్సింది. ఈ చిత్రం లో హీరోయిన్ గా ‘దేవయాని’ నటించింది. ఆమె కంటే ముందుగా సౌందర్య నే అడిగారట. కానీ డేట్స్ సర్దుబాటు కాక ఈ సినిమా ఆమె చెయ్యి జారిపోయింది. అలా వీళ్లిద్దరు కలిసి సినిమాలో నటించకపోయినా, కనీసం షార్ట్ ఫిలిం లో నటించారు, ఆ తృప్తి చాలు అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here