Guess The actress : కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తు పట్టారా?

- Advertisement -

 

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా సెలెబ్రేటిల చిన్నప్పటి ఫోటోలు, ఫ్యామిలీ ఫోటోలు ఎక్కువగా వైరల్ అవుతుండటం చూస్తూనే ఉన్నాం. అందులో కొన్ని రేర్ ఫిక్స్ అని నెట్టింట తెగ ట్రెండ్ అవుతున్నాయి. ఈ క్రమంలో ఓ హీరోయిన్ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..

ఇంతకీ ఎవరు ఆ హీరోయిన్ అనుకుంటున్నారా? ఆ ఫొటోలో కనిపిస్తున్న హీరోయిన్ ను గుర్తు పట్టారా? ఒకప్పుడు తన అందంతో కుర్రాళ్లకు నిద్రలేకుండా చేసిన హీరోయిన్ ఈమె.. సౌందర్య లహరి.. స్వప్న సుందరి.. నువ్వే నామాధురీ.. అనే పాట అందరికీ గుర్తే ఉంటుంది.. ఇప్పటికి ఆ పాటకు క్రేజ్ తగ్గలేదు. అందులో నటించిన హీరోయిన్ గురించి కొద్ది మందికి మాత్రమే తెలిసి ఉంటుంది.. ఆమె పేరు దీప్తి భట్నాగర్.

- Advertisement -

ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన పెళ్లి సందడి సినిమాతో దీప్తి తెలుగుతెరకు పరిచయమైంది. నాగార్జున సరసన ఆటో డ్రైవర్, బాలకృష్ణ సరసన సుల్తాన్, మా అన్నయ్య సినిమాలో రాజశేఖర్ ప్రేమించిన అమ్మాయి గా గెస్ట్ రోల్ చేసింది. ఆ తర్వాత పెద్దగా సినిమాల్లో కనిపించలేదు.. ప్రేమించి పెళ్లి చేసుకొని విదేశాల్లో సెటిల్ అయ్యింది. చాలా కాలం తర్వాత ఆమె సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన ఫ్యామిలీ ఫోటోలను షేర్ చేస్తుంది.. ఆ ఫొటోలే ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.. మీరు ఓ లుక్ వేసుకోండి..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here