పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన ‘బ్రో ది అవతార్’ చిత్రం నిన్ననే గ్రాండ్ గా విడుదలై డివైడ్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ప్రారంభం లో డివైడ్ టాక్ వచ్చినప్పటికీ సెకండ్ హాఫ్ ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యింది. ఈ చిత్రం మొత్తం పవన్ కళ్యాణ్ తన తిరుగులేని ఎనర్జీ తో, అద్భుతమైన ఎంటర్టైన్మెంట్ యాంగిల్ తో లాక్కొచ్చాడు.

సాయి తేజ్ కూడా అంత పెద్ద యాక్సిడెంట్ జరిగిన తర్వాత యాక్టింగ్ విషయం లో చాలా ఇబ్బందికి గురి అయ్యుంటాడేమో అని ముందు అనుకున్నారు కానీ, ఆయన కూడా ఈ చిత్రం లో అద్భుతంగా నటించాడు. ఇక ఆయనకీ చెల్లెళ్లుగా ప్రియా ప్రకాష్ వారియర్, యువ లక్ష్మి నటించారు. ప్రియా ప్రకాష్ వారియర్ గురించి ప్రతీ ఒక్కరికి తెలిసిందే. ఈమె హీరోయిన్ గా అందరికీ సుపరిచితం.

కానీ యువ లక్ష్మి గురించి మాత్రం మన టాలీవుడ్ ఆడియన్స్ ఎవరికీ తెలియదు. ఈమె ‘బ్రో ది అవతార్’ చిత్రం కంటే ముందు ఎన్నో సూపర్ హిట్ తమిళ సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. క్యారక్టర్ ఆర్టిస్టుగా కూడా చేసింది. నిజం చెప్పాలంటే ‘బ్రో ది అవతార్’ చిత్రం లో ప్రియా ప్రకాష్ వారియర్ కంటే కూడా అందరికీ ఈ అమ్మాయే ఎక్కువగా నచ్చింది. ఎవరు ఈ అమ్మాయి అని గూగుల్ లో బాగా వెతకగా ఆమె తమిళ సినీ పరిశ్రమకి చెందిన ప్రముఖ నటి అని తెలిసింది.

కచ్చితంగా ఈమెకి టాలీవుడ్ లో ‘బ్రో ది అవతార్‘ చిత్రం తర్వాత నుండి మంచి అవకాశాలు వస్తాయి అనడం లో ఎలంటిఇ సందేహం లేదు. సముద్ర ఖని తమిళ సినిమా ఇండస్ట్రీ కి చెందిన వాడు కాబట్టి, ఈమెని సెలెక్ట్ చేసి ఉంటారని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. అంతే కాదు ఈమె బాలనటిగా కూడా తమిళం లో ఎన్నో సినిమాల్లో నటించింది.