‘బ్రో ది అవతార్’ మొదటి రోజు వసూళ్లు.. నెగటివ్ టాక్ తో ఇదేమి అరాచకం సామీ!

- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన ‘బ్రో ది అవతార్’ మూవీ నిన్న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలైన సంగతి అందరికీ తెలిసిందే. ఏడాది తర్వాత వస్తున్న పవన్ కళ్యాణ్ సినిమా కావడం తో ఈ మూవీ పై ఫ్యాన్స్ లో ఉన్న అంచనాలు మామూలివి కావు. అయితే ఆ అంచనాలను ఈ చిత్రం మొదటి ఆట నుండే అందుకోలేకపోయింది. డివైడ్ టాక్ ని సొంతం చేసుకుంది. కానీ వసూళ్ల పరంగా మాత్రం దుమ్ము లేపేసింది.

బ్రో ది అవతార్
బ్రో ది అవతార్

రెండు తెలుగు రాష్ట్రాల్లో టికెట్ ముక్క దొరకడం చాలా కష్టం అయిపోయింది. చాలా థియేటర్స్ బయట బ్లాక్ లో టికెట్స్ అమ్ముకుంటున్నారు. ఈ రేంజ్ విద్వంసం అభిమానులు కూడా ఊహించలేదు. నెగటివ్ టాక్ వచ్చింది, సినిమా ప్లాప్ అవుతుందేమో అని భయపడ్డారు. కేవలం ఆ ఒక్క రోజు మాత్రమే కాదు, రెండవ రోజు కూడా అదే రేంజ్ అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయి.

ట్రేడ్ పండితుల లెక్క ప్రకారం మొదటి రోజు ఈ సినిమాకి ఎంత వసూళ్లు వచ్చాయో ఒకసారి చూద్దాం. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతం గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. ఈ ప్రాంతం లో ఎక్కడా చూసిన వరదలు ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. అయినప్పటికీ కూడా మొదటి నుండి ప్రతీ చోట హౌస్ ఫుల్ కలెక్షన్స్ నమోదు అయ్యాయి. ట్రేడ్ పండితుల సమాచారం ప్రకారం ఈ చిత్రానికి మొదటిరోజు నైజాం ప్రాంతం లో 10 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.

- Advertisement -

అలాగే కృష్ణ జిల్లాలో కోటి 20 లక్షలు, ఉత్తరాంధ్ర లో 3 కోట్ల రూపాయిలు , ఈస్ట్ మరియు వెస్ట్ గోదావరి కలిపి 5 కోట్ల రూపాయిలు వసూలు చేసింది. అన్నీ చోట్ల వసూళ్లు అద్భుతంగా వచ్చాయి కానీ, సీడెడ్ ప్రాంతం లో మాత్రం బాగా తగ్గాయి. అక్కడ ఇలాంటి సినిమాలకు ఓపెనింగ్ తక్కువ వస్తుంది అనే విషయం అందరికీ తెలిసిందే. ట్రేడ్ లెక్కల ప్రకారం ఆ ప్రాంతం లో ఈ సినిమాకి రెండున్నర కోటి రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.

అలా ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ కలిపి ఈ చిత్రానికి మొదటి రోజు దాదాపుగా 20 నుండి 22 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఇది పవర్ స్టార్ రేంజ్ వసూళ్లు అసలు కాదు. కానీ వచ్చిన టాక్ కి , ఎంచుకున్న జానర్ కి ఇది చాలా బెటర్ వసూళ్లు అనే చెప్పాలి. రెండవ రోజు కూడా అన్నీ ప్రాంతాలలో అద్భుతమైన అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయి. మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి మొదటి రోజు 30 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here