మెగా హీరో Sai Dharam Tej ఆ మధ్య బైకు యాక్సిడెంట్ కు గురైన సంగతి తెలిసిందే.. ఆ ప్రమాధాన్ని ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సాయి ధరం తేజ్ నెల రోజుల పాటు ఆసుపత్రికే పరిమితమయ్యాడు చాలా రోజుల పాటు కోమాలో ఉండి ఆ తర్వాత కోలుకొని ఇటీవల విరూపాక్ష సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా ఆ చిత్రం ఘన విజయం సాధించింది..ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సాయి ధరమ్ తేజ్ తనను కాపాడిన వ్యక్తి గురించి కొన్ని వ్యాఖ్యలు చేయగా ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తేజ్ నీ ప్రమాదం నుంచి కాపాడిన వ్యక్తి పేరు సయ్యిద్ అబ్దుల్. అతడు హైదరాబాద్లో గల సిఎంఆర్ షాపింగ్ మాల్ లో బ్రతుకుతెరువు కోసం ఉద్యోగం చేస్తూ ఉంటాడు…
అయితే ఇటీవల తేజు మాట్లాడుతూ..తనని కాపాడిన వ్యక్తికి డబ్బులు ఇచ్చి చేతులు దులుపుకోలేను.. అతడిని కలిసి నా ఫోన్ నెంబర్ ఇచ్చాను ఎప్పుడు ఇలాంటి సహాయం కావాల్సి వచ్చినా మొహమాటం లేకుండా ఫోన్ చేయమని చెప్పాను అంటూ తెలిపాడు. దాంతో ప్రస్తుతం సాయి ధరంతేజ్ తను కాపాడుకునే వ్యక్తికి లక్షల రూపాయల డబ్బులు ఇచ్చినట్టుగా సోషల్ మీడియాతో పాటు శ్రీ మీడియా కూడా కొన్ని వార్త కథనాలను ప్రసారం చేసింది… కానీ అబ్దుల్ మాత్రం తనను ఎవరు కలవలేదని, ఎటువంటి సాయం కూడా చెయ్యలేదని చెప్పిన విషయం కూడా క్లారిటి ఇచ్చాడు..ఇదే విషయాన్ని ధరమ్ తేజ్ కూడా ఓ ఇంటర్వ్యూ లో చెప్పారు..
డబ్బులు ఇచ్చి నా ప్రాణాలు నిలిపిన వ్యక్తికి థాంక్స్ చెప్పి తనని పంపించలేను. అందుకే నా నెంబర్ ఇచ్చి తనకు ఏ సమయంలో ఎప్పుడు ఎలాంటి సహాయం కావాలన్నా నాకు ఫోన్ చేయమని చెప్పానని తెలిపారు. నా కుటుంబ సభ్యులు అతనికి ఏదైనా డబ్బు సహాయం చేశారేమో నాకు తెలియదు కానీ నేను మాత్రం డబ్బులు ఇచ్చి ఆ డబ్బుతో తన మానవత్వాన్ని ముడి పెట్టలేను.. అతడికి సహాయం కావాలంటే ఎక్కడి వరకైనా తాను వెళ్తానని ఈ సందర్భంగా సాయిధరమ్ తేజ్ వెల్లడించారు.
ఇదే సమయంలో తాను అసలు మద్యం సేవించనని క్లారిటీ ఇచ్చారు. ఇక ఆరోజు తాను ఇలాంటి బైక్ రైసింగ్ లో పాల్గొనలేదని డైరెక్టర్ దేవకట్టా ఇంటికి వెళ్తున్నట్టు ఈ సందర్భంగా సాయి ధరమ్ తేజ్ తెలిపారు. ఇలా తన ప్రాణాలు కాపాడిన వ్యక్తి గురించి సాయి ధరమ్ తేజ చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి… ప్రస్తుతం విరూపాక్ష సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న తేజ్ మరో రెండు ప్రాజెక్టు లలో నటించనున్నారని టాక్..