Chiranjeevi : 7 పదుల వయస్సుకి దగ్గర పడుతున్నా కూడా నేటి తరం ఆడియన్స్ కి నచ్చినట్టు మెలగడం మెగాస్టార్ చిరంజీవి స్టైల్. ఈ వయస్సులో ఆయన మైంటైన్ చేస్తున్న లుక్స్ చాలా మంది కుర్ర హీరోలకు కూడా లేదు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అలాగే సోషల్ మీడియా వాడకం లో కూడా మెగాస్టార్ ని మించిన టాలీవుడ్ హీరో మరొకరు లేరు. స్టైలింగ్ కూడా చాలా ప్రత్యేకంగా ఉండేటట్టుగా ఆయన మ్యానేజ్ చేస్తాడు.
ఇకపోతే రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవి తన చేతికి వెనుక భాగం లో ఒక స్త్రీ పేరు ని పచ్చబొట్టు వేయించుకున్నాడట. అది ఆయన సతీమణి సురేఖ పేరు అయ్యుంటాది అని అనుకుంటే పెద్ద పొరపాటే. ఆమె పేరు కాకుండా మరో స్త్రీ పేరు వేయించుకున్నాడట. చిరంజీవి జీవితం లో సురేఖ గారు కాకుండా అంత ముఖ్యమైన స్త్రీ ఎవరు అయ్యుంటారు అబ్బా అని మీరు ఆలోచిస్తున్నారు కదా?.
అది ఎవరి పేరో కాదు, తన మాతృ మూర్తి అంజనమ్మ పేరు ని పచ్చబొట్టు వేయించుకున్నాడట. ఇన్ని సంవత్సరాలు రాని ఈ ఆలోచన మెగాస్టార్ కి ఇప్పుడే ఎందుకు వచ్చింది అని అభిమానులు అనుకుంటున్నారు. పెద్ద వయస్సు వచ్చిన తర్వాత పెద్దవాళ్ళు చిన్న పిల్లలుగా వ్యవహరిస్తారని అంటూ ఉంటారు. చిరంజీవి కూడా ప్రస్తుతం ఆ స్టేజిలోనే ఉన్నాడని ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్.
ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి ‘భోళా శంకర్‘ లాంటి డిజాస్టర్ ఫ్లాప్ తర్వాత ‘భింభిసారా’ డైరెక్టర్ వసిష్ఠ తో ఒక సినిమా చెయ్యబోతున్నాడు. రీసెంట్ గానే పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కబోతున్న ఈ చిత్రానికి ‘విశ్వంభర’ అనే టైటిల్ ని ఫిక్స్ చేసారని సమాచారం. సోషియో ఫాంటసీ నేపథ్యం లో ఈ చిత్రం తెరకెక్కబోతుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.