ఎంగేజ్మెంట్ చేసుకున్న అనుపమ పరమేశ్వరన్.. ఎవరితోనో తెలుసా?

- Advertisement -

హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. ఒక్కో సినిమాతో తన క్రేజ్ ను పెంచుకుంటూ వస్తుంది.. సినిమాలు చేస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ను పెంచుకుంటుంది.. అమ్మడు క్యూట్ నెస్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఓ రేంజులో ఉంటుంది. ఎప్పటికప్పుడు ఆమె షేర్ చేసే ఫోటోలు యూత్ ను బాగా ఆకట్టుకుంటున్నాయి.. ఈ క్రమంలో తాజాగా ఓ ఫోటోను షేర్ చేసింది.. అది కాస్త సోషల్ మీడియాను షేక్ చేస్తుంది..

అనుపమ పరమేశ్వరన్
అనుపమ పరమేశ్వరన్

సాదారణంగా హీరోయిన్స్ కు ఆటపట్టిస్తూ క్రేజ్ ను సంపాదించుకోవడం అలవాటే..అప్పుడప్పుడు కవ్వించడానికి, కొన్ని సందర్భాల్లో చిత్ర ప్రమోషన్స్ కోసం తప్పుదోవ పట్టిస్తారు. ఆ మధ్య నిత్యా మీనన్ ఓ ప్రాజెక్ట్ ప్రమోషన్ కోసం తల్లి అయ్యానంటూ పోస్ట్స్ పెట్టింది. మొదట నిజమే అనుకున్నారు.. ఇక ఇప్పుడు అనుపమ కూడా అలాంటి షాక్ ఇచ్చారు. తనకు ఎంగేజ్మెంట్ జరిగిందని ఫోటోలు పోస్టు చేసింది.. చేతికి కవర్ ను కట్టి ఎంగేజ్మెంట్ రింగ్ అంటూ పోస్టు పెట్టింది.. అదంతా కాసేపు నిజమే అనుకున్నారు..

Anupama Parameswaran

కానీ అసలు విషయం తెలుసుకొని అంతా నవ్వుకున్నారు..ఇటీవల కార్తికేయ 2 లో నటించింది.. అది భారీ హిట్ ను అందుకోవడంతో అనుపమ మళ్లీ ఫాంలోకి వచ్చింది.. కార్తికేయ 2 అనంతరం విడుదలైన 18 పేజెస్ కమర్షియల్ గా ఆడలేదు. సుకుమార్ శిష్యుడు సూర్య ప్రతాప్ 18 పేజెస్ టైటిల్ తో రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. థియేటర్స్ లో ఆడకున్నా ఓటీటీ లో బాగానే అలరించింది.. బటర్ ఫ్లై కూడా చేసింది అది అంత బాగా ఆకట్టుకోలేదు.. ఇప్పుడు మలయాళం, తమిళ్ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here