Amala Paul : సినీ ఇండస్ట్రీలో చాలా మంది తమ చుట్టూ ఉన్నవాళ్ళతో ప్రేమలో పడి పెళ్లి చేసుకుంటారు. కొంతమందేమో డేటింగ్ లు చేసి కొన్ని రోజులు వారితో తిరిగి అభిప్రాయ బేధాలు రావడంతో వారితో పెళ్లికి ముందే విడిపోతారు. ఇంకొంతమందేమో పెళ్లి అయ్యాక కొన్ని రోజులకు మనస్పర్ధలు తలెత్తడంతో విడిపోతుంటారు. ఇక ఇలాంటి వారి కోవకే చెందుతుంది హీరోయిన్ అమలాపాల్ కూడా. ఈమె తమిళ్ డైరెక్టర్ విజయ్ తో ప్రేమలో పడి చాలా రోజులు ప్రేమించుకొని ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు.. ఏమైందో గానీ విడాకులు తీసుకున్నారు.. ఆ తర్వాత సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.. ఈ మధ్య కుర్రాళ్లను హీటేక్కించే హాట్ ఫోటోలను షేర్ చేస్తూ వస్తుంది.. తాజాగా ఈ అమ్మడు రెండోసారి ప్రేమలో పడిందని వార్తలు వినిపిస్తున్నాయి.. ఎవరితో ప్రేమలో పడిందో ఇప్పుడు తెలుసుకుందాం..
విడాకులు తీసుకున్న తర్వాత అమ్మడు ఒంటరిగా ఉంటుంది.ఇదిలా ఉంటే అమలాపాల్ నాయక్, ఇద్దరమ్మాయిలతో వంటి సినిమాలతో తెలుగులో స్టార్ హీరోయిన్గా మారిపోయింది. అంతేకాదు మొదట్లోనే ఈమె ఇద్దరు స్టార్ హీరోలతో నటించడంతో ఈమె కెరియర్ మారిపోతుంది అనుకున్నారు దర్శక నిర్మాతలు. కానీ అందుకు భిన్నంగా ఈమె నటించే సినిమాలు అంతగా హిట్ అవ్వలేదు. దాంతో ఈ హీరోయిన్ కి అవకాశాలు రావడం లేదు.. అయితే తెలుగులోనే కాదు తమిళ్ లో కూడా సినిమాలు చేసింది.. ఈ మధ్యకాలంలో అవకాశాలు అంతగా రాకపోవడంతో అమలాపాల్ వెబ్ సిరీస్ ల వైపు తన అడుగు వేసి వరుసగా వెబ్ సిరీస్ లో నటిస్తోంది.
తాజాగా అమలాపాల్ గురించి ఒక విషయం సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది. అదేంటంటే అమలాపాల్ రెండోసారి ప్రేమలో పడింది అంటూ ఒక వార్త వైరల్ గా మారింది. మరి ఇంతకీ అమలాపాల్ ప్రేమలో పడ్డ వ్యక్తి ఎవరు ఎవరో అని ఆలోచిస్తున్నారుగా.. తను ప్రేమలో పడింది ఓ చెట్టుతో.. అవును మీరు విన్నది అక్షరాల నిజం..ఈ మధ్యనే బాలి అనే దేశానికి వెకేషన్ కి వెళ్ళింది. అక్కడ పొడవాటి ఒక మొక్కతో ఆమె మొదటిసారి చూడడంతోనే ప్రేమలో పడిందట. దీంతో తన సోషల్ మీడియా ఖాతాలో ఇదే విషయాన్ని చెబితే అసలు విషయం తెలియని చాలామంది ఏంటి అమలాపాల్ రెండోసారి ప్రేమలో పడిందా అని కామెంట్లు పెడుతున్నారు.మొత్తానికి ఇది వైరల్ అవుతుంది..