Sai Pallavi : అప్పట్లో పీవీ.. ఇప్పుడు సాయిపల్లవి… ఏకంగా ఎన్ని భాషలు మాట్లాడుతుందో తెలుసా ?

- Advertisement -


Sai Pallavi : ఈటీవీ ఢీ డ్యాన్స్ షోతో వెలుగులోకి వచ్చింది సాయిపల్లవి. అనంతరం మలయాళ ఇండస్ట్రీలో ప్రేమమ్ సినిమాతో హీరోయిన్ గా అడుగుపెట్టింది. తర్వాత టాలీవుడ్ లో వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన ఫిదా సినిమాతో ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. మొదటి సినిమాతోనే కుర్ర కారును ఫిదా చేసింది. డీ గ్లామ‌ర‌స్ రోల్ కు ఇంపార్టెన్స్ ఇస్తూ కథలో తన పాత్రకు ప్రాధాన్యత ఉందనిపిస్తేనే నటించే ఈ అమ్మడు ఎంతో మంది స్టార్ హీరోల సినిమాలను సైతం రిజెక్ట్ చేసింది. అయితే తన నటించిన సినిమాలు అన్ని దాదాపు మంచి సక్సెస్ అందుకున్నాయి. లేడీ పవర్ స్టార్ గా క్రేజ్‌ను దక్కించుకుంది సాయి పల్లవి. తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళ భాషల్లోనూ నటిస్తూ మెప్పించింది.

Sai Pallavi
Sai Pallavi

కొంతకాలంగా సినిమాలకు బ్రేక్ ఇచ్చింది సాయి ప‌ల్లవి. దీంతో సోషల్ మీడియాలో ఎన్నో రకాల వార్తలు పుట్టుకొచ్చాయి. ఆమె ఇకపై డాక్టర్ గా సెటిల్ అవుతుందని.. అందుకే సినిమాలకు గుడ్ బై చెప్పిందంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే ఈ వార్తలపై ఎప్పుడు స్పందించని సాయి పల్లవి ఇటీవల నాగచైతన్య తండేల్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఈ వార్తలకు చెక్ పడింది. నాగచైతన్య హీరోగా నటిస్తున్న ఈ సినిమాను గీత ఆర్ట్స్2 బ్యానర్ పై భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఈ నేపథ్యంలో గతంలో సాయి పల్లవి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ వీడియో సోషల్ మీడియాలో నెట్టింట్లో వైరల్ అవుతోంది.

ఈ వీడియోలో సాయి పల్లవి తన పర్సనల్ విషయాలను షేర్ చేసుకుంది. సాయి పల్లవి అసలు పేరు, డేట్ ఆఫ్ బ‌ర్త్‌, వెయిట్ ఇలా అన్ని వరుసగా చెప్పుకొచ్చింది. సాయి పల్లవి అస‌లు పేరు సాయి ప‌ల్లవి సింతామరై, పుట్టిన తేదీ 9.5.1992, క్వాలిఫికేషన్ డాక్టర్, డ్యాన్సర్, యాక్టర్ అంటూ చెప్పుకొచ్చింది. అయితే ఆమెకు తెలుగుతో కలిపి ఏకంగా ఎనిమిది భాషలు వచ్చునట. తమిళ, ఇంగ్లీష్, మలయాళం, కన్నడ, హిందీ, జార్జియం, బడగా ఇలా అన్ని భాషలు అవలీలగా మాట్లాడుతుందట సాయి పల్లవి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here