Balakrishna : టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో నందమూరి నటసింహ బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నటుడు నందమూరి తారక రామారావు వారసుడిగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన బాలకృష్ణ అంచెలంచెలుగా స్టార్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్నాడు. ఈ వయసులోనూ యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నారు బాలకృష్ణ. పదహారేళ్ల వయసులోనే బాలనటుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. కానీ నటనలో అంత క్రమశిక్షణ, నటనలో ప్రావీణ్యం వచ్చిందంటే.. అది కేవలం తన తండ్రి ఎన్టీఆర్ వల్లనే అని చెప్పొచ్చు. బాలకృష్ణ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వగానే మొదట సీనియర్ ఎన్టీఆర్‌తో చాలా సినిమాల్లో నటించాడు.

తర్వాత సోలో హీరోగా నటించి స్టార్ డమ్ తెచ్చుకున్నాడు. అయితే ఎన్టీఆర్, బాలకృష్ణల మల్టీ స్టారర్ చిత్రాల్లో పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి జీవిత చరిత్ర ఒకటి. ఎన్టీఆర్ టైటిల్ రోల్ పోషించగా, బాలయ్య వీరబ్రహ్మేంద్ర స్వామి అమర భక్తుడు సిద్దప్పగా నటించారు. నాలుగు కోట్లు వసూలు చేసి భారీ రికార్డు సృష్టించింది. అయితే ఈ సినిమా దర్శకత్వ బాధ్యతలను ఎన్టీఆర్ స్వయంగా తీసుకున్నాడు. సినిమా విడుదల సమయంలో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. కానీ అంతకు ముందే సినిమా విడుదల కావాల్సి ఉన్నా.. సెన్సార్ అభ్యంతరాల కారణంగా సినిమా విడుదల ఆలస్యమైంది.

ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా గెలుపొందిన తర్వాత సెన్సార్ నుంచి అనుమతి తీసుకుని ఈ చిత్రాన్ని విడుదల చేశారు. ఈ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ అయింది. ఎన్టీఆర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా బాలయ్యకు కూడా దర్శకత్వ మెళకువలు నేర్పించారు. సినిమాలో కొన్ని కెమెరా షాట్లను బాలయ్యే స్వయంగా చిత్రీకరించిన సంగతి తెలిసిందే. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాలయ్య కెమెరామెన్‌గా నటించిన ఏకైక చిత్రం ఈ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి సినిమా.