Anchor Sree mukhi : ఆ స్టార్ హీరో సినిమాలో నటించడం ఇష్టం లేదంటూ యాంకర్ శ్రీముఖి షాకింగ్ కామెంట్స్!

- Advertisement -

Anchor Sree mukhi : ప్రస్తుతం బుల్లితెర పై స్టార్ యాంకర్స్ గా కొనసాగుతున్న వారిలో శ్రీముఖి ఒకరు. సుమ తర్వాత ఇప్పుడు బుల్లితెర లో ఎంటర్టైన్మెంట్ షోస్ ని నిర్వహించే ప్రముఖ నిర్మాణ సంస్థలు శ్రీముఖి ని హోస్ట్ గా పెట్టుకునేందుకు క్యూలు కడుతున్నాయి. మంచి కామెడీ టైమింగ్ తో పాటు చలాకి తనం ఉంది కాబట్టే శ్రీముఖి అతి తక్కువ సమయం లోనే స్టార్ యాంకర్ గా అవతరించింది.

కానీ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కి మాత్రం శ్రీముఖి ని ఎవ్వరూ హోస్ట్ గా పెట్టుకోరు. ఆ ఈవెంట్స్ కి సుమ ఇప్పటికీ టాప్ లీడింగ్ లోనే కొనసాగుతుంది. ఇదంతా పక్కన పెడితే శ్రీముఖి స్టార్ యాంకర్ గా మాత్రమే కాదు, పలు సినిమాల్లో ముఖ్య పాత్రలు కూడా పోషిస్తూ ఉంటుంది. అంతే కాకుండా ఈమె బిగ్ బాస్ మూడవ సీజన్ లో కంటెస్టెంట్ గా పాల్గొని రన్నర్ గా నిల్చింది.

ఇదంతా పక్కన పెడితే యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ తో ఒక సినిమాలో నటించే అవకాశం వస్తే శ్రీముఖి మొహమాటం లేకుండా రిజెక్ట్ చేసిందట. ప్రభాస్ పెద్ద పాన్ ఇండియన్ సూపర్ స్టార్. ఆయన సినిమాలో ఎలాంటి పాత్ర ఇచ్చినా చెయ్యడానికి సిద్ధంగా ఉంటారు స్టార్ హీరోయిన్స్ సైతం. అలాంటి సూపర్ స్టార్ సినిమాలో నటించే అవకాశం నడుచుకుంటూ వస్తే శ్రీముఖి ఎందుకు రిజెక్ట్ చేసింది?, అందుకు కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

- Advertisement -

ప్రభాస్ కెరీర్ లో మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ నటించగా, సెకండ్ హీరోయిన్ గా తాప్సి నటించింది. ఇందులో ప్రభాస్ చెల్లెలు క్యారక్టర్ ని ముందుగా శ్రీముఖి కి వరించింది అట. కానీ శ్రీముఖి మొహమాటం లేకుండా నో చెప్పేసిందట. అందుకు కారణం చెప్తూ ‘ప్రభాస్ నా డార్లింగ్.. నా ఫేవరెట్ హీరో..ఛాన్స్ వస్తే అతనితో రొమాన్స్ చేసే పాత్రని చేస్తాను కానీ, చెల్లి పాత్ర ఎందుకు చేస్తాను. అందుకే రిజెక్ట్ చేశాను’ అని చెప్పుకొచ్చింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here