Ram Charan : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చిరంజీవి తనయుడిగా ఇండస్ట్రీలోకి వచ్చి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకున్నారు. చిరంజీవి వారసుడిగా ఎంట్రీ ఇచ్చినా కూడా టాలెంట్ తో గ్లోబల్ స్టార్ అయిపోయారు. ముఖ్యంగా ఆర్ఆర్ఆర్ సినిమాతో ఓ రేంజ్ లో పేరు తెచ్చుకున్నారు. విపరీతమైన క్రేజ్ ని సంపాదించుకున్నారు. చిరంజీవి తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోగా పేరు ప్రఖ్యాతలు పొందితే రామ్ చరణ్ పాన్ ఇండియా హీరోగా గ్లోబల్ స్టార్ గా ఇమేజ్ ని దక్కించుకున్నారు. నటుడుగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్న చరణ్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నారు.
సాధారణంగా సెలబ్రిటీలు టాటూలు ఎక్కువగా వేయించుకోవడానికి ఇష్టం చూపిస్తూ ఉంటారు వాళ్ళ టాటూలు కి సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ అవుతూ ఉంటాయి. వివిధ రకాల డిజైన్స్ లేదంటే వాళ్ళకి నచ్చినటువంటి పేర్లను టాటూలు కింద వేయించుకుంటూ ఉంటారు. ఇప్పటిదాకా రామ్ చరణ్ ఒక్క టాటూ కూడా వేయించుకోలేదు. రామ్ చరణ్ ఇలా టాటూలు వేయించుకోకపోవడానికి కారణం కూడా ఉంది. తండ్రి చిరంజీవికి ఇలా టాటూలు వేయించుకోవడం అసలు ఇష్టం ఉండదట. తన తండ్రికి ఇష్టం లేదని కారణంతో రామ్ చరణ్ టాటూలు కి దూరంగా ఉంటారట.
తనకి కూతురు పుట్టిన తర్వాత ఒక టాటూ వేయించుకున్నారని తెలుస్తోంది. తండ్రికి ఇష్టం లేదని తెలిసినా రామ్ చరణ్ టాటూ వేయించుకున్నారు. ఇక ఆ టాటూ గురించి చూస్తే రామ్ చరణ్ తన కూతురు పుట్టిన తర్వాత కూతురు పేరులో మొదటి అక్షరం, ఉపాసన రామ్ చరణ్ పేర్లలోని మొదటి అక్షరాలు మూడు కే యూ సి అనే అక్షరాలని చాతి మీద టాటూ గా వేయించుకున్నారట. ఇప్పటిదాకా టాటూలు అంటే ఇష్టం లేని చరణ్ ఛాతి మీద ఈ మూడు అక్షరాలు టాటూ కింద వేయించుకున్నారు.