Taapsee Pannu : ఈ ఏడాది భారీ అంచనాల నడుమ విడుదలైన చిత్రాలలో ఒకటి షారుఖ్ ఖాన్ హీరో గా నటించిన ‘డుంకీ’. బాలీవుడ్ లో అసలు అపజయం అనేదే ఎరుగని డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమా రీసెంట్ గానే విడుదలై డివైడ్ టాక్ ని తెచ్చుకుంది. ఓపెనింగ్స్ కూడా అంతంత మాత్రం గానే.

ఈ ఏడాది ప్రారంభం లో ‘పఠాన్’ చిత్రం తో 1000 కోట్ల రూపాయిల గ్రాస్ ని కొల్లగొట్టిన షారుఖ్ ఖాన్, రీసెంట్ గానే ‘జవాన్’ చిత్రంతో మరోసారి వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ మార్కుని అందుకొని, ఒకే ఏడాది లో రెండు సార్లు వెయ్యి కోట్ల మార్కుని అందుకున్న ఏకైక హీరో గా చరిత్ర తిరగరాసాడు. అలాంటి విజయాలు వచ్చాయి కాబట్టే ‘డుంకీ’ చిత్రం పై అంచనాలు భారీగా ఉండేవి. ఓపెనింగ్స్ పెద్దగా లేవు కానీ, లాంగ్ రన్ మాత్రం బలంగానే ఉండేట్టు ఉంది.

ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాలో హీరోయిన్ గా తాప్సి నటించిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు టాలీవుడ్ నుండి బాలీవుడ్ కి వెళ్లి సక్సెస్ లు చూసి అగ్ర కథానాయికగా ఎదిగిన వారి లిస్ట్ తీస్తే తాప్సి నెంబర్ 1 స్థానం లో ఉంటుంది. టాలీవుడ్ లో ఉన్నంత కాలం ఆమెకు మీడియం రేంజ్ హీరోయిన్ స్థాయి మాత్రమే ఉండేది. కానీ బాలీవుడ్ లోకి అడుగుపెట్టాక ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది.

అంతే కాకుండా ఫిమేల్ సెంట్రిక్ మూవీస్ లో కూడా నటించి ఆ జానర్ లో కూడా సూపర్ హిట్స్ అందుకున్న నటి తాప్సి, అందుకే ఆమెకి ఏకంగా షారుఖ్ ఖాన్ , రాజకుమార్ హిరానీ లాంటి లెజెండ్స్ కలయిక లో నటించే ఛాన్స్ దక్కింది. ఈ సినిమాకి ఆమె ఏకంగా 10 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ తీసుకుందట. ఇంత రెమ్యూనరేషన్ తో ఇక్కడ మీడియం రేంజ్ సినిమాని తీసేయొచ్చు. ఆమె కెరీర్ లోనే హైయెస్ట్ పారితోషికం అందుకుంది ఈ చిత్రానికే అట.