మెగా ఫ్యామిలీ నుంచి చాలామంది హీరోలు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. వీరందరికి ఆధారం చిరంజీవినే అని ప్రత్యేకంగ చెప్పాల్సిన పనిలేదు. అలాగే చిరు తమ్ముడైన నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్ 2014లో ముకుందా సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత కంచె, మిస్టర్, లోఫర్, గద్దల కొండ గణేష్, ఫిదా, ఎఫ్2, ఎఫ్3 వంటి సూపర్ హిట్ సినిమాలు చేసి ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. కొన్ని సినిమాలు ఆశించిన విజయాలు సాధించలేక వెనకబడ్డాయి. అయినప్పటికీ హిట్ ఫ్లాపులతో సంబంధంలేకుండా వరుణ్ సినిమాలు చేస్తూనే ఉన్నాడు. ప్రస్తుతం వరుణ్ తేజ్ గాండీవదారి అర్జున
లో నటిస్తున్నారు. ప్రవీణ్ సత్తారు డైరక్షన్లో రాబోతున్న సినిమాలో సాక్షివైద్య హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా వచ్చే నెలలో విడుదల కానుంది.
ఈ సినిమా తర్వాత ‘పలాస’ మూవీ దర్శకుడు కరుణకుమార్ దర్శకత్వంలో వరుణ్ తన నెక్ట్స్ మూవీని ప్రకటించాడు. ఈ సినిమాకు మట్కా
అనే టైటిల్ ను అనౌన్స్ చేశారు. ఇందులో మీనాక్షి చౌదిరి హీరోయిన్. ఇది ఇలా ఉంటే అటు సినిమాల్లో రాణిస్తూనే వరుణ్ పలు వ్యాపారాల్లో కూడా తనదైన మార్క్ వేస్తున్నాడు. అంతేకాకుండా పలు బ్రాండ్స్ కు కూడా అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నాడు. ఈ క్రమంలోనే వరుణ్ మొత్తంగా రెండు చేతులా భారీగానే సంపాదించాడు.
అందిన సమాచారం ప్రకారం.. 2023 నాటికి వరుణ్ తేజ్ నికర ఆస్తుల విలువ రూ. 47 కోట్లు అని తెలుస్తోంది. వరుణ్ ముకుందా సినిమాకు గాను రూ.74లక్షల పారితోషకం తీసుకున్నాడు. ప్రస్తుతం తాను ఒక్కో సినిమాకు రూ. 10 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు. అలాగే వరుణ్ తన సంపాదనతో గాయత్రి హిల్ లో ఒక గెస్ట్ హౌస్ ను కొన్నారు. అలాగే తన పేరిట హైదరాబాద్ లో పలు ఫ్లాట్స్, స్థలాలు ఉన్నాయి. వరుణ్ తేజ్ గ్యారేజీలో నాలుగు లగ్జరీ కార్లు ఉన్నాయి. త్వరలోనే సొట్టబుగ్గల సుందరి లావణ్యతో పెళ్లి పీటలెక్కబోతున్నాడు.