Kalki : ప్రపంచం మొత్తం ఎంతో ఆత్రుతగా ఎదురు చూసిన సమయం రానే వచ్చింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన కల్కి సినిమా థియేటర్లలోకి రానే వచ్చింది. దీంతో ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. థియేటర్ల దగ్గర సందడి నడుస్తోంది. ప్రస్తుతం ఎక్కడ చూసిన ఆ సినిమా డైరెక్టర్ నాగ అశ్విన్ గురించే. ఆయన పేరు మార్మోగిపోతుంది. నిన్న మొన్నటి వరకు టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ ఎవరు అంటే కచ్చితంగా రాజమౌళి పేరు ఫస్ట్ వినిపించేది. ఆ తర్వాత సుకుమార్ లాంటి వాళ్ల పేర్లు వినిపించేవి. అయితే ఇప్పుడు ఎక్కడ చూసినా సరే నాగ అశ్విన్ పేరే మార్మోగిపోతుంది. దానికి కారణం కల్కి సినిమా అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటి వరకు టాలీవుడ్ ఇండస్ట్రీలోని ఏ డైరెక్టర్ ఎంచుకోని కథను తీసుకుని ఒక స్పెషల్ ప్రాజెక్ట్ తో మన ముందుకు రాబోతున్నాడు నాగ అశ్విన్.
థియేటర్లలోకి వచ్చిన కల్కి సినిమా చూసిని ప్రేక్షకులు విజువల్ వండర్ అని కొనియాడుతున్నారు. ఈ సినిమాతో నాగ అశ్విన్ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కించుకోవడం పక్కా అంటున్నారు. అంతేకాదు ఇప్పుడు ఈయనకి సంబంధించిన విషయాలు తెలుసుకోవడానికి జనాలు ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఒకానొక సమయంలో స్కూల్ ఆవరణలో ఎవరో చెట్లు నరికేస్తుంటే చూసి బాధపడిపోయి ప్రకృతిని నాశనం చేస్తే ఏం జరుగుతుందని స్టోరీ కూడా ప్రిన్సిపాల్ కి చెప్పారట. నాగ అశ్విన్ తల్లిదండ్రులు ఇద్దరూ డాక్టర్లే. కాగా నాగ అశ్విన్ ఇండస్ట్రీలో అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా వర్క్ చేశారు. క్లాసిక్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దగ్గర కూడా నాగ అశ్విన్ అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు. అంతేకాదు మంచు మనోజ్ హీరోగా నటించిన నేను మీకు తెలుసా సినిమాకు కూడా వర్క్ చేశారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన లీడర్, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా నాగ అశ్విన్ వర్క్ చేశారు.