Director Teja : ఒక సినిమాని తెర మీదకి తీసుకురావాలంటే హీరో హీరోయిన్లు మాత్రమే కాదు. దర్శకుడు పాత్ర కూడా చాలా ముఖ్యమైనది. అసలు కథ కి మూలం దర్శకుడు. దర్శకుడు సినిమా తీయాలంటే చాలా ఒత్తిడి ఉంటుంది. ఆ ఒత్తిడిని అధిగమిస్తూ సినిమాని తెర మీదకి తీసుకురావాలి పైగా దానికి తోడు అన్ని డిపార్ట్మెంట్ల మీద కూడా దర్శకుడు కి అవగాహన అనేది ఉండాలి. లేదంటే సినిమా ఫెయిల్ అవుతుంది. అందులో డౌట్ లేదు. ప్రతిదాన్ని అబ్సర్వ్ చేసుకుంటూ ప్రతి ఒక్క టెక్నీషియన్ దగ్గర నుండి బెస్ట్ అవుట్ ఫుట్ ని తీసుకుంటూ ముందుకు సాగాలి దర్శకుడు.
అందుకు తగ్గట్టుగా షూటింగ్స్ లో ఆర్టిస్టులు నటించేటప్పుడు రెండు మూడు టేకులు ఎక్కువగా తీసుకున్నట్లయితే దర్శకులు ఆ నటుల మీద కోప్పడతారు. డైరెక్టర్లకి బాగా ఎక్కువ కోపం వస్తే నటులను తిడుతూ ఉంటారు కూడా. తేజ మాత్రం ఆర్టిస్టులు సరిగ్గా పెర్ఫామ్ చేయకపోతే మాత్రం సెట్లోనే అందరి ముందు వాళ్ళని కొడతారట. ఇటువంటి క్రమంలో ఆయన ఇప్పటిదాకా చేసిన సినిమాల్లో దాదాపు పది మందికి పైగా ఆర్టిస్టులని కొట్టారట. ముఖ్యంగా చిత్రం, నువ్వు నేను సినిమా చేసే టైంలో ఉదయ్ కిరణ్ ని కూడా రెండు మూడు సార్లు తేజ కొట్టారట.
జయం సినిమా టైంలో సుమన్ శెట్టి ని జై సినిమా టైం లో నవదీప్ ని కూడా కొట్టారట. లక్ష్మీ కళ్యాణం సినిమాలో కాజల్ ని ఇలా చాలామందిని కొట్టారనే వార్తలు ఉన్నాయి. డైరెక్ట్ గా తేజాని కూడా చాలామంది ఈ టాపిక్ గురించి అడిగారు. సెట్ లో కోపం వచ్చినప్పుడు సహజంగా ఇలాంటివి జరుగుతాయి అని దర్శకుడు తేజ చెప్పారు. దానికి తగ్గట్టుగానే ఒక దర్శకుడు సెట్ లో మొత్తం వర్క్ లోనే మునిగిపోతాడు కనుక అక్కడ కోపానికి లోనవ్వడం కానీ కొట్టడం కానీ నార్మల్ గా జరుగుతూ ఉంటాయి అని అన్నారు. ఆర్టిస్టులు కూడా ఇటువంటి వాటిని లైట్ తీసుకుంటారని అన్నారు.