‘ఊపిరి’ సినిమాలో నాగార్జున తో కలిసి డ్యాన్స్ వేసిన ఈ హాట్ బ్యూటీ భర్త ఒక పెద్ద స్టార్ హీరో అనే విషయం ఎవరికైనా తెలుసా!

- Advertisement -

అక్కినేని నాగార్జున కెరీర్ లో క్లాసిక్ గా నిల్చిన చిత్రాలలో ఒకటి ‘ఊపిరి’. ఈ చిత్రం లో నాగార్జున తో పాటుగా తమిళ హీరో కార్తీ కూడా నటించిన సంగతి అందరికీ తెలిసిందే. వీళ్లిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు ఆడియన్స్ కి ఎంతో బాగా కనెక్ట్ అయ్యింది. అందుకే ఈ చిత్రం అప్పట్లో అంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ‘సోగ్గాడే చిన్ని నాయన’ చిత్రం తో భారీ హిట్ ని అందుకున్న నాగార్జున కి, మళ్ళీ వెంటనే ఈ సినిమా రూపం లో మరో భారీ బ్లాక్ బస్టర్ దక్కింది.

నాగార్జున
నాగార్జున

ఎమోషన్స్ తో పాటుగా కామెడీ కూడా పర్ఫెక్ట్ గా వర్కౌట్ అయినా చివరి నాగార్జున సినిమా ఇదే. సినిమా మొత్తం వీల్ చైర్ లో కూర్చొని నాగార్జున కేవలం ముఖ కవిలకలతోనే ఎంతో అద్భుతంగా నటించాడు. అప్పట్లోనే ఈ సినిమా సుమారుగా 50 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను సాధించింది.

Upiri movie

అయితే ఈ సినిమాలో నాగార్జున మరియు కార్తీ ప్యారిస్ కి వెళ్ళినప్పుడు ‘జెన్నీ’ అనే ఒక అమ్మాయి పరిచయం అవుతుంది. ఆమెని నాగార్జున ఒక్క వారం లోనే పడేస్తాను అని కార్తీ తో సవాలు విసురుతాడు. చెప్పినట్టుగానే ఆమెని వారం రోజుల్లో పడేస్తాడు. ఈ ఎపిసోడ్ మొత్తం మీ అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. ఇందులో జెన్నీ గా నటించిన అమ్మాయి ఎవరు, ఇంత బాగుంది, మళ్ళీ ఏ సినిమాలో కూడా కనిపించలేదే అని చాలా మంది అనుకున్నారు. అయితే ఆమె అసలు పేరు ‘గ్యాబ్రిల్లా దేమిట్రాయిడ్స్’.

- Advertisement -
NAgarjuna

ఈమె ఒక పాపులర్ అమెరికన్ మోడల్. అక్కినేని నాగార్జున ఒకసారి ఈమె ఫోటో షూట్ చూసి, ఈ అమ్మాయిని మనం ఈ సన్నివేశం కోసం తీసుకుందామని డైరెక్టర్ వంశీ పైడిపల్లి తో అన్నాడట. అలా ఈమె ఊపిరి చిత్రం లో నటించింది. మీ అందరికీ తెలియని మరో విషయం ఏమిటంటే, ఈమె ప్రముఖ బాలీవుడ్ హీరో అర్జున్ రాంపాల్ ని ప్రేమించి పెళ్లాడింది, వీళ్లిద్దరి వివాహం 2018 వ సంవత్సరం లో జరిగింది. ఈమెకి ఒక బాబు కూడా ఉన్నాడు. ఈమెకి సంబంధించిన లేటెస్ట్ ఫోటోలు కొన్ని మీకోసం అందిస్తున్నాము చూడండి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here