టాలీవుడ్ లో చైల్డ్ ఆర్టిస్టుగా అద్భుతంగా రాణించి చిన్నతనం లోనే స్టార్ స్టేటస్ దక్కించుకున్న నటుడు తరుణ్. ఆ తర్వాత పెద్దయ్యాక హీరోగా కూడా ఎన్నో సూపర్ హిట్స్ ని అందుకొని లవర్ బాయ్ ఇమేజిని సొంతం చేసుకున్నాడు. అప్పట్లో ఈయనకి యూత్ లో ఉన్న క్రేజ్ మామూలుది కాదు. నువ్వే కావలి, ప్రియమైన నీకు, నువ్వు లేక నేను లేను, నువ్వే నువ్వే ఇలా ఒక్కటా రెండా, ఎన్నో అద్భుతమైన బ్లాక్ బస్టర్ హిట్స్ ని అందుకొని అనతి కాలం లోనే స్టార్ హీరో గా ఎదిగాడు.
ఆ తర్వాత కెరీర్ లో వరుసగా ఫ్లాప్స్ రావడం తో సినిమాల నుండి తప్పుకొని వ్యాపార రంగం లోకి షిఫ్ట్ అయ్యాడు. అక్కడ గొప్పగా రాణించడంతో ఈయన ఆ రంగం లో స్థిరపడిపోయాడు. ఇక ఈయన కుటుంబం గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు అందరికీ తెలిసిందే.
తల్లి రోజారమని ఇండస్ట్రీ లో పెద్ద ఆర్టిస్ట్.బాలనటిగా ఎన్నో సినిమాల్లో నటించి జాతీయ పురస్కారం కూడా అందుకుంది, ఆ తర్వాత హీరోయిన్ గా, క్యారక్టర్ ఆర్టిస్టుగా మరియు డబ్బింగ్ ఆర్టిస్టుగా ఇలా ఇండస్ట్రీ లో ఎన్నో విభాగాల్లో కొనసాగింది.ఇక తండ్రి చక్రపాణి కూడా ఇండస్ట్రీ లో పెద్ద నటుడే.తరుణ్ కి అమూల్య అనే చెల్లెలు కూడా ఉంది, ఈమె సినిమాల్లోకి అయితే రాలేదు కానీ, ప్రైవేట్ పార్టీలలో తరచూ కనిపిస్తూ ఉంటుంది.
ఈమె 2017 వ సంవత్సరం లో జగదీశ్ అనే అతనిని పెళ్లి కూడా చేసుకుంది. ఈమెకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా లో అందుబాటులోనే ఉన్నాయి. మంచి అందం ఉన్నప్పటికీ ఎందుకో ఆమె సినిమాల్లోకి మాత్రం రాలేదు, ఒకవేళ వచ్చి ఉంటే కచ్చితంగా పెద్ద స్టార్ హీరోయిన్ అయ్యేదని అంటున్నారు ఫ్యాన్స్.