Samantha కు గుడి కడుతున్న వీరాభిమాని.. ఎక్కడో తెలుసా?

- Advertisement -

Samantha : తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ సమంతకు ప్రత్యేక స్థానం ఉన్న సంగతి తెలిసిందే.. తనకు ఏ రేంజ్ లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంటుందో మనందరికీ తెలుసు.. ఆమె చేసే సినిమాలకన్నా సమంత బయట పేద ప్రజల కోసం చేస్తున్న కార్యక్రమాలు జనాలను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.. దాంతో చాలా అభిమానులు ఆమెను దేవతలా చూస్తున్నారు.. ఈ క్రమంలో ఓ అభిమాని సమంతకు ఏకంగా గుడి కట్టిస్తున్నాడు.. ప్రస్తుతం ఈ వార్త హాట్ టాపిక్ అవుతుంది… ఇక ఆలస్యం ఎందుకు ఆ గుడి గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

samantha-temple
samantha- temple

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతకు దేశ వ్యాప్తంగా ఎంతటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. స్టార్ హీరోలకు సమానంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్న అమ్మడుకు డై హార్డ్ ఫ్యాన్స్ కూడా ఉన్నారన్న విషయం తెలిసిందే.. సమంత కోసం పడి చచ్చేంత అభిమానం వారిదని తేలిపోయింది.. ఈ క్రమంలోనే యశోద సినిమా కోసం ఫ్యాన్స్ థియేటర్ల దగ్గర భారీ ఫ్లెక్సీలను పెట్టారు..హీరోయిన్లలో ఎవరికీ లేని క్రేజ్ సామ్ కు దక్కింది.

సమంత సినిమాలు, ఆమె ఆరోగ్యం విషయమైన ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ సపోర్ట్ గా నిలుస్తుంటారు. ఇక అసలు విషయానికొస్తే.. తాజాగా సమంత వీరాభిమాని ఏకంగా గుడినే కట్టిస్తున్నాడు. దైవంతో సమానంగా చూస్తూ సమంతపై తన అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి…

- Advertisement -
nidhhi agarwal temple

ఆంధ్రప్రదేశ్ లోని బాపట్ల జిల్లాలో గల ఆలపాడుకు చెందిన సందీప్ అనే యువకుడు సమంతకు వీరాభిమాని. రెండురోజుల్లో సమంత బర్త్ డే ఉండటంతో సందీప్ తన అభిమానాన్ని చాటుకునేందుకు ఇంటిలోనే సమంతకు గుడి కట్టిస్తున్నాడు. ఇందుకోసం సమంత విగ్రహాన్ని కూడా తయారు చేయించాడు.. సమంత మయోసైటిస్ వ్యాధి నుంచి కోలుకున్నందుకు తిరుపతి, చెన్నై, నాగపట్నం, కడపలోని ఫేమ్ దర్గాను కూడా సందర్శించారు. తన మెక్కులు చెల్లిస్తూ యాత్ర కూడా నిర్వహించాడు సందీప్.

ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది.. ఇప్పటికే చాలా మంది హీరోయిన్లకు గుడి కట్టారు..ఇకపోతే తమిళనాడులో నిధి అగర్వాల్ కు కూడా అభిమానులు గుడి కట్టించారు.. అక్కడ వరుస సినిమాలు చేస్తున్న అమ్మడుకు ఫ్యాన్స్ గుడి కట్టించడం తో పాటు పాలాభిషేకం కూడా చేశారు.. ఇందుకు సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..

ఇటీవల శాకుంతలం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సమంత హిట్ ను అందుకోలేక పోయింది.. విజయ్ దేవరకొండ సరసన నటిస్తున్న ‘ఖుషీ’తో అలరించేందుకు సిద్ధం అవుతోంది. మరోవైపు క్రేజీ సిరీస్ ‘సిటడెట్’ ఇండియన్ వెర్షన్ లోనూ నటిస్తుంది..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here