Guess The Actor : సినీ ఇండస్ట్రీ లో ప్రస్తుతం టాప్ స్థానం లో కొనసాగుతున్న సూపర్ స్టార్స్ అందరికీ ఊరికే ఆ స్థానం రాలేదు. దాని వెనుక ఎన్నో కష్టాలు, ఎంతో కృషి మరియు పట్టుదల ఉన్నాయి. వాటితో పాటుగా అదృష్టం కూడా కలిసొచ్చింది. ఈ ఫోటో లో కనిపిస్తున్న ఈ చిన్న పిల్లాడు కూడా అలా పైకి వచ్చిన వాడే. కెరీర్ ప్రారంభం అవకాశాల కోసం చెయ్యని ప్రయత్నం అంటూ ఏది లేదు.
చేతిలో రూపాయి కూడా లేక ఆకలితో ఇబ్బంది పడిన రోజులు కూడా ఉన్నాయి. అలాంటి రోజుల్లో సినిమాల్లో లైట్ మ్యాన్ గా పని చేసే అవకాశం వచ్చింది. ఆ తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ గా ఎన్నో సినిమాలకు పని చేసాడు. ఆ తర్వాత డైరెక్టర్ మరియు హీరో అయ్యాడు. డైరెక్టర్ గా ఎలాంటి సంచలనాత్మక చిత్రాలను తీసాడో, అలాగే హీరో గా కూడా అలంటి సంచలనాత్మక చిత్రాల్లో నటించాడు. అతను మరెవరో కాదు, కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర.
అప్పట్లో కన్నడ హీరోలు ఎవ్వరూ కూడా ఇతర భాషల్లో పాపులారిటీ ని సంపాదించలేదు, అలాంటి రోజుల్లోనే ఉపేంద్ర కి తెలుగు లో మంచి క్రేజ్ ఉండేది. ఈయన ఆరోజుల్లో హీరో గా నటించినా ‘రా’, ‘ఉపేంద్ర’ వంటి చిత్రాలు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ని దున్నేశాయి. ‘రా’ చిత్రం అయితే తెలుగు లో ఆరోజుల్లోనే నాలుగు కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను సాధించి, అత్యధిక సెంటర్స్ లో వంద రోజులు కూడా పూర్తి చేసుకుంది.
అలా అప్పటి నుండి ఉపేంద్ర కి టాలీవుడ్ లో మన హీరోలతో సమానంగా క్రేజ్ ఉండేది. ఆయన సినిమా వస్తుందంటే ఫ్లెక్సీలు మరియు కటౌట్స్ కట్టేవాళ్ళు. ఇకపోతే ఉపేంద్ర ఆరోజుల్లో కన్నడ స్టార్ హీరో శివ రాజ్ కుమార్ తో చేసిన ‘ఓం’ అనే చిత్రం ఇండస్ట్రీ రికార్డ్స్ మొత్తాన్ని తిరగరాసింది. అలా డైరెక్టర్ గా కూడా ఆయన ఎన్నో సక్సెస్ లు అందుకున్నాడు, ఇక హీరో గా ఇప్పటికీ అగ్రశ్రేణి నటులలో ఒకరిగా కొనసాగుతూ ముందుకు దూసుకుపోతున్నాడు.