ఈ ఫొటోలో కనిపిస్తున్న అబ్బాయిని ఎవరైనా గుర్తు పెట్టగలరా..?, ఒక సాధారణ మధ్య తరగతి కుటుంబానికి చెందిన అబ్బాయి, చిన్న తనం నుండే కష్టం విలువ తెలిసి పెరిగిన వ్యక్తి . ఇతని తండ్రి కేవలం ఒక బస్సు కండక్టర్ మాత్రమే. కానీ ఆ అబ్బాయికి చిన్నతనం నుండి కోరికలు బాగా ఎక్కువ. సినిమాల్లో నటించాలని ఎంతో ఆశ ఉండేది, పెద్ద సూపర్ స్టార్ అవ్వాలని కలలు కన్నాడు. చిన్న తనం నుండే నాటకాలు వెయ్యడం ప్రారంభించాడు, నటన మీద అమితాసక్తి ఉన్నప్పటికీ ఇంటి స్తొమత గుర్తుకు వచ్చి, తండ్రికి సహాయ పడాలనే గొప్ప ఉదేశ్యం తో చదువుని మధ్యలోనే ఆపేసి ఆటో డ్రైవర్ గా కొన్నేళ్లు పని చేసాడు.

ఒక పక్క ఆటో డ్రైవర్ గా చేస్తూనే మరోపక్క సినిమాల్లో చిన్న పాత్ర అయినా దొరికితే బాగుంటుంది నాయి ఎన్నో ప్రయత్నాలు చేసి చేతికి వచ్చిన ప్రతీ అవకాశం ని ఉపయోగించుకున్నాడు. అలా యాంకర్ గా సీరియల్ ఆర్టిస్టు గా, ఆ తర్వాత క్యారక్టర్ ఆర్టిస్టుగా ఇలా వచ్చిన ప్రతీ అవకాశాన్ని ఉపయోగించుకొని, ఆ తర్వాత హీరో గా మారి ఎన్నో సూపర్ హిట్స్ ని అందుకొని నేడు పాన్ వరల్డ్ స్టార్ గా ప్రఖ్యాతి గాంచాడు. అతను మరెవరో కాదు రాకింగ్ స్టార్ యాష్.

ఇతను కేజీఎఫ్ సినిమాతో పాన్ వరల్డ్ రేంజ్ లో ప్రతీ ఒక్కరికి సుపరిచితమే. అయితే కేజీఎఫ్ సిరీస్ కంటే ముందుగా ఆయన ఎన్నో కన్నడ సినిమాల్లో నటించి సూపర్ హిట్స్ ని అందుకున్నాడు. కేజీఎఫ్ చిత్రం తో ఇతర భాషల్లో కూడా సుపరిచితం అయ్యాడు. ఈ సినిమా తర్వాత ఆయన ఏ చిత్రం లో నటించబోతున్నాడు అనేదానిపై ప్రస్తుతానికి సస్పెన్స్ కానీ తెలుగు లో మాత్రం ఒక స్టార్ హీరో రేంజ్ మార్కెట్ ని సంపాదించుకున్నాడు అనే చెప్పాలి.

ఆయన హీరో గా నటించిన కేజీఎఫ్ చాప్టర్ 2 చిత్రం కేవలం తెలుగు వెర్షన్ నుండి 100 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను సాధించింది. ఇది సాధారణమైన విషయం కాదు, ఎందుకంటే ఇంకా చాలా మంది తెలుగు హీరోలకు వంద కోట్ల రూపాయిల షేర్ సినిమాలు లేవు. ఇక రాబోయే చిత్రం తో యాష్ ఎలాంటి సంచలనం సృష్టించబోతున్నాడో చూడాలి.
