Disha Patani : హాట్ బ్యూటీ దిశా పటానీ ‘లోఫర్’ సినిమాతో తెలుగులోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత ‘ఎంఎస్ ధోని – అన్ టోల్డ్ స్టోరీ’ చిత్రంతో సక్సెస్ కొట్టి క్రేజీ ఫాలోయింగ్ సంపాదించుకుంది. అయితే తెలుగులో అంతగా అవకాశాలు రాకపోవడంతో.. బ్యాక్ టు బాలీవుడ్ చెక్కేసింది. అక్కడే ఉంటూ హిందీ సినిమాలపై దృష్టి పెట్టింది. అక్కడ స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది. ‘కుంఫు యోగా’, ‘భారత్’, ‘భాగీ 2’ ‘మలంగ్’, ‘ఏక్ విలన్ రిటర్న్స్’ వంటి సినిమాలతో పాపులర్ అయింది. ప్రస్తుతం ‘యోధ’ చిత్రంతో పాటు.. యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ తో కలిసి ‘వెల్కమ్ టు ది జంగిల్’ సినిమాలో నటిస్తోంది.
దిశా పటాని చాలా గ్యాప్ తర్వాత ‘కల్కి 2898 AD’ సినిమాతో మళ్లీ సౌత్ లోకి రీ ఎంట్రీ ఇవ్వనుంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సైన్స్ ఫిక్షన్ మూవీలో ఆమెను ఓ కీలక పాత్ర కోసం ఎంపిక చేశారు. అలానే ‘కంగువ’ చిత్రంతో తమిళ చిత్ర పరిశ్రమలో కూడా అడుగుపెడుతోంది. శివ డైరెక్షన్ లో రూపొందుతున్న ఈ పీరియాడిక్ సినిమాలో హీరో సూర్యకు జోడీగా నటిస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా బాలీవుడ్లో నెలకొన్న నెపోటిజంపై ఈ హాట్ బ్యూటీ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
నెపోటిజం విషయంలో అవకాశం చిక్కినప్పుడల్లా బాలీవుడ్ డైరెక్టర్, నిర్మాత అయిన కరణ్ జోహార్ ను టార్గెట్ చేస్తూ కొందరు ట్రోల్ చేస్తూ ఉంటారు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చిన వారికి ఆయన అవకాశాలు దూరం చేస్తాడని, టాలెంట్ లేని స్టార్ కిడ్స్ ని ఎంకరేజ్ చేస్తాడని ఆగ్రహం వ్యక్తం చేస్తుంటాడు. అయితే కరణ్ జోహార్ ని సమర్థిస్తూ తాజాగా బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ పై కరణ్ జోహర్ ప్రస్తుతం ‘యోధ’ అనే నిర్మిస్తు్న్నారు. ఇందులో సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా నటిస్తుండగా.. దిశా పటానీ, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. సాగర్ అంబ్రే, పుష్కుర్ ఓజా సంయుక్తంగా ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ చిత్రం మార్చి 15న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో లేటెస్టుగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా దిశా మాట్లాడుతూ తనలోని నటిని గుర్తించింది కరణ్ జోహార్ అని చెప్పింది. తాను ఈరోజు హీరోయిన్ అయ్యానంటే, అది కేవలం కరణ్ జోహార్ వల్లనే అంటూ ఆయనను ఆకాశానికి ఎత్తే ప్రయత్నం చేసింది. తాను మోడలింగ్ చేస్తున్నప్పుడు తన వయసు 18ఏళ్లు. ఆ సమయంలో తనలో నటన ఉందని గుర్తించింది ఆయనే అని పేర్కొంది. ఆ సమయంలో ఆయన గుర్తించకపోయుంటే, ఇక్కడ అలా ఉండేదాన్ని కాదని భావిస్తున్నాను. కొందరు ఆయన గురించి ఏమైనా మాట్లాడొచ్చు.. కానీ నేనొక బయటి వ్యక్తినే నటిగా నిరూపించుకునేందుకు కరణ్ ఇచ్చిన అవకాశంగా భావిస్తున్నట్లు దిశ చెప్పుకొచ్చింది.