Disha Patani : వైట్ ఫ్రాక్​లో ఏంజిల్​లా దిశాపటానీ.. అమ్మడు సోకుల విందుకు కుర్రాళ్లు ఫిదా

- Advertisement -

Disha Patani : బాలీవుడ్ గ్లామర్ డాల్ దిశా పటానీ వరుస సినిమాలతో బిజీబిజీగా ఉంది. ఇటీవలే ఈ భామ నటించిన యోధ రిలీజ్ అయి సూపర్ హిట్ టాక్ అందుకుంది. ఈ చిత్రంలో దిశా తన గ్లామర్​తోనే కాదు యాక్షన్​తో కూడా ప్రేక్షకులను ఫిదా చేసింది. సిద్ధార్థ్ మల్హోత్రా, రాశీ ఖన్నాతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న దిశ ఈ సినిమాలో తన నటనతో మాయ చేసింది. ముఖ్యంగా ఎయిర్ హోస్టెస్​గా రెడ్ కలర్ శారీలో దిశాను చూసి కుర్రాళ్లు మనసు పారేసుకున్నారు.

Disha Patani
Disha Patani

ఇక ఆ సినిమా సక్సెస్ జోష్​లో ఉన్న దిశా ఆ విజయాన్ని జాలీగా ఎంజాయ్ చేస్తోంది. ఇక తాజాగా హోలీ వేడుకల్లో కూడా పాల్గొని సందడి చేసింది. మరోవైపు సోషల్ మీడియాలో ఫొటోషూట్లతో వరుసగా ఫొటోలు పోస్టు చేస్తూ ప్రేక్షకులకు ఊపిరి తీసుకునే టైం కూడా ఇవ్వడం లేదు. ఇక గ్లామరస్ ఫొటోషూట్స్​తో ఘాటు పోజులతో కుర్రాళ్లకు కునుకు లేకుండా చేస్తోంది దిశ. తాజాగా ఈ భామ వైట్ కలర్ ఫ్రాక్​లో ఉన్న ఫొటోలను నెట్టింట పోస్టు చేసింది. ఇంకేం.. క్షణాల్లో ఆ ఫొటోలు వైరల్ అయ్యాయి. లక్షల లైకులు వేలల్లో షేర్లతో సోషల్ మీడియా హీటెక్కింది.

- Advertisement -

ఈ ఔట్​ఫిట్​లో దిశ ఏంజిల్​లా కనిపించింది. వైట్ కలర్ లాంగ్ ఫ్రాక్​లో క్లీవేజ్ షో చేస్తూ కుర్రాళ్లకు కైపెక్కించింది. ముసిముసి నవ్వు నవ్వుతూ ఒక పోజు, సెన్షువల్​గా ఇంకో పోజుతో పిచ్చెక్కించేసింది. మొత్తానికి దిశ తన గ్లామర్​తో మరోసారి కుర్రాళ్లను కట్టిపడేసింది. ఇక ఈ ఫొటోల కింద కుర్రాళ్ల కామెంట్లు చూస్తే ఈ బ్యూటీ అందానికి ఎంత మంది దాసోమయ్యారో తెలిసిపోతుంది. వావ్ దిశ వాట్ ఏ లుక్ అంటూ ఒకరు, మై దిశ.. మై డార్లింగ్. .యూ ఆర్ గార్జియస్ అంటూ ఇంకొకరు ఇలా నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

ఇక దిశ లేటెస్ట్ సినిమాల సంగతికి వస్తే ఈ బ్యూటీ కేవలం బాలీవుడ్ సినిమాలే కాదు, తెలుగు, తమిళంలోనూ నటిస్తోంది . తెలుగులో రెబల్ స్టార్ ప్రభాస్​తో కలిసి కల్కిలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక తమిళంలో సూర్యతో కలిసి కంగువాలో జత కడుతోంది. మరోవైపు మలంగ్-2, వెల్​కమ్ టు ద జంగిల్​ వంటి బాలీవుడ్ సినిమాలు కూడా చేస్తోంది దిశా పటానీ.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here