Director Shankar : ప్రస్తుతం చాలామంది డైరెక్టర్లు ‘సినిమాటిక్ యూనివర్స్’ అంటూ కొత్త ఐడియాలతో ఇండియన్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్తున్నారు. తమిళ్‌లో లోకేష్ కనగరాజ్ ఇప్పటికే లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ (LCU)ను మొదలుపెట్టారు. అలానే తెలుగులో హనుమాన్ చిత్రం తీసిన డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కూడా ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (PVCU)ను మొదలుపెట్టారు.తాజాగా కల్కి 2898 ఏడీ సినిమా డైరెక్టర్ నాగ్ అశ్విన్ కూడా కల్కి సినిమాటిక్ యూనివర్స్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే. మరి ఇలాంటి ఐడియా సీనియర్ డైరెక్టర్ శంకర్‌కి కూడా వచ్చిందట. ప్రస్తుతం ఇండియన్ 2 ప్రమోషన్స్‌లో ఉన్న ఆయన ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని రివీల్ చేశారు.
మీకు ఎప్పుడూ శంకర్ సినిమాటిక్ యూనివర్స్ మొదలుపెట్టాలని అనిపించలేదా? భారతీయుడు, రోబో క్యారెక్టర్లను కలిపి ఏమైనా తీయొచ్చు కదా అంటూ శంకర్‌ను ఇంటర్వ్యూలో ప్రశ్నించారు. దీనికి శంకర్ క్రేజీ ఆన్సర్ ఇచ్చారు. “2008లో రోబో సినిమా తీసేటప్పుడు నాకు ఇలాంటి ఐడియానే ఒకటి వచ్చింది. భారతీయుడు, ఒకేఒక్కడు, శివాజీ చిత్రాల్లో హీరో పాత్రలన్నీ కలిపి ఒక సినిమాను తీద్దామనే ఐడియా వచ్చింది. ఆ ఆలోచన నాకు చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. దీంతో వెంటనే నా అసిస్టెంట్స్ అందరినీ పిలిచి ఈ ఐడియా గురించి చెప్పాను. కానీ వాళ్లంతా నన్ను పై నుంచి కింద వరకూ ఏదో పిచ్చోడిని చూసినట్లుగా చూశారు. దీంతో ఆ ఆలోచన అక్కడితోనే వదిలేశాను. ఇలా చాలా ఐడియాలు వస్తూ ఉంటాయి.. పోతూ ఉంటాయి. ఎవరికైనా చెప్పినప్పుడు సరైన రెస్పాన్స్ రాకపోతే అవి వదిలేస్తూ ఉంటాను.” అంటూ శంకర్ చెప్పారు.
ఇక కెరీర్ విషయానికొస్తే ప్రస్తుతం ఇండియన్ 2 (భారతీయుడు 2) ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు శంకర్. పాన్ ఇండియా లెవల్లో జులై 12న ఈ చిత్రం రిలీజ్ కాబోతుంది. 28 ఏళ్ల క్రితం వచ్చిన భారతీయుడు చిత్రానికి ఇది సీక్వెల్. కమల్ హాసన్ సేనాపతి రోల్‌లో నటించారు. సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
“During 2008, I had thought of Making the lead characters of INDIAN, MUDHALVAN & SHIVAJI together in a single film (SHANKAR CINEMATIC UNIVERSE)🤯🔥. I didn’t get a response when I told this idea to my assistants, so dropped it👀”
– Shankar pic.twitter.com/6QOV5tOKrM— AmuthaBharathi (@CinemaWithAB) June 28, 2024