Director KS Ravi Kumar : రైటర్,డైరెక్టర్ కేఎస్ రవికుమార్ తాజాగా బాలకృష్ణపై అనుచిత వ్యాఖ్యలు చేసారు. బాలకృష్ణతో రెండు సినిమాలు చేసిన దర్శకుడు కేఎస్ రవికుమార్ ఇప్పుడు నందమూరి బాలకృష్ణ మీద చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో కలకలం రేపుతున్నాయి. సెట్ లో ఎవరు నవ్వినా హీరో బాలకృష్ణ ఏ మాత్రం తట్టుకోలేడని, వెంటనే కోపగించుకుంటాడని..అంతేకాకుండా నవ్విన వ్యక్తిని పిలిచి చెయ్యి చేసుకుంటారని కేఎస్ రవికుమార్ అన్నారు. ‘గార్డియన్’అనే తమిళ మూవీ ప్రెస్ మీట్‌కి హాజరైన కేఎస్ రవికుమార్ మాట్లాడుతూ..బాలకృష్ణతో సినిమా చేస్తున్నప్పుడు షూటింగ్లో ఎవరైనా నవ్వుతున్నట్లు కనిపిస్తే తట్టుకోలేడు.
తనని చూసి నవ్వుతున్నారని అనుకొని ‘ఆయన ఎందుకు నవ్వుతున్నాడు?’ వెంటనే కోపం వచ్చేస్తుందని..ఆ నవ్వుతున్న వ్యక్తిని పిలిచి కొడతారని అన్నారు. అలా ఓ మూవీ షూటింగ్ టైంలో ఫ్యాన్ నా వైపు తిప్పమని నా అసిస్టెంట్ డైరెక్టర్ శరవణన్ కి చెప్పాను..అతడు అనుకోకుండా బాలయ్య వైపు ఫ్యాన్ తిప్పడంతో..ఆయన విగ్గు కాస్త అటు ఇటు అయింది. దాంతో శవరణన్ కాస్త నవ్వాడు. అది చూసి బాలకృష్ణ వెంటనే కోపం తెచ్చుకున్నారు. ‘హే.. ఎందుకు నవ్వుతున్నావ్’ అని బాలయ్య గట్టిగా అరిచాడు. ఆయన మళ్ళీ వీడిని ఎక్కడ పిలిచి కొడతాడో అని నేనే వెళ్లి..అతను మన అసిస్టెంట్ డైరెక్టర్ శరవణన్ అని సర్ది చెప్పే ప్రయత్నం చేశాను.
దానికి ఆయన ‘లేదు లేదు.. వీడు ఆపోజిట్ గ్యాంగ్. చూడు చూడు, ఇప్పుడు కూడా నవ్వుతున్నాడు’ అని అన్నాడు. అయినప్పటికీ ఆయన కూల్ కాలేదు వెంటనే నోరు మూసుకుని ఇక్కడ నుంచి వెళ్ళిపో అని శరవణన్ కి అరిచి చెప్పాను. ఈ విషయాన్ని దర్శకుడు రవికుమార్ నవ్వుతూ చెప్పగా.. ఆ సమయంలో వేదిక మీదున్న హీరోయిన్ హన్సిక మోత్వానీతో పాటు మిగతా టీమ్ కూడా నవ్వుతూ ఉన్నారు. ప్రస్తుతం ఈ కేఎస్ రవికుమార్ మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుందో.