Rajamouli తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచం నలుమూలల విస్తరింపజేసిన ఘనుడు రాజమౌళి.కెరీర్ లో అపజయం అనేదే లేని దర్శకుడిగా అరుదైన రికార్డు ని నెలకొల్పిన రాజమౌళి, 2009 వ సంవత్సరం లో విడుదలైన మగధీర సినిమాతోనే తన సత్తా ఏంటో జాతీయ లెవెల్ లో చూపించాడు.అప్పటి వరకు తెలుగు సినిమా అంటే చాలా చిన్న చూపుని చూపే బాలీవుడ్ ఇండస్ట్రీ మన టాలీవుడ్ వైపు చూడడం ప్రారంభించింది, ఆ తర్వాత ఈగ సినిమాని హిందీ లో కూడా విడుదల చేసారు.

తెలుగులో కంటే కూడా ఆ సినిమా హిందీలోనే సూపర్ హిట్ అయ్యింది,ఇక తర్వాత ఆయన చేసిన బాహుబలి సిరీస్ మన టాలీవుడ్ ఇండస్ట్రీ ని ఎవ్వరు అందుకోలేనంత ఎత్తుకి తీసుకెళ్లాడు.ఇప్పుడు #RRR సినిమా తో పాన్ ఇండియా లెవెల్ ని దాటి పాన్ వరల్డ్ రేంజ్ కి మన టాలీవుడ్ ని తీసుకెళ్లాడు.ఎన్నో అంతర్జాతీయ అవార్డ్స్ ని సొంతం చేసుకున్న ఈ చిత్రం ఈ నెల 12 వ తేదీన ఆస్కార్ అవార్డ్స్ ని కూడా అందుకోబోతుంది.

మన టాలీవుడ్ ని అంత ఉన్నత శిఖరాలకు చేర్చిన రాజమౌళి, ఇక మన ఇండస్ట్రీ ని వదిలేయబోతున్నాడా..? , త్వరలో మహేష్ బాబు తో చెయ్యబోతున్న సినిమానే ఆఖరి సినిమా కానుందా..?, రాజమౌళి చేసిన లేటెస్ట్ కామెంట్స్ చూస్తుంటే అవుననే అనాలని అనిపిస్తుంది.రీసెంట్ గా అమెరికా లో పాల్గొన్న ఒక ఇంటర్వ్యూ లో రాజమౌళి మాట్లాడుతూ ఇప్పుడు చెయ్యబొయ్యే సినిమా తర్వాత నేను హాలీవుడ్ లో ఒక సినిమా చేయబోతున్నాను అని చెప్పుకొచ్చాడు.

ఒక ప్రముఖ హాలీవుడ్ సంస్థ తో అగ్రిమెంట్ కూడా కుదిరినట్టు తెలుస్తుంది.ఒక్క సినిమా చెయ్యడానికి కనీసం మూడేళ్ళ సమయం తీసుకునే రాజమౌళి, హాలీవుడ్ లో ఒక్కో సినిమా చెయ్యడానికి ఇంకెంత సమయం తీసుకుంటాడో అని ఆయన అభిమానులు భయపడిపోతున్నారు.ఒక్కసారి హాలీవుడ్ లోకి అడుగుపెడితే అది ఒక సినిమాతో పోదు, వరుసగా అవకాశాలు వస్తూనే ఉంటాయి,ఆ లెక్కన చూసుకుంటే రాజమౌళి ఇక మన తెలుగు సినిమాలు మిస్ అవబోతున్నాడా అనే సందేహాలు తలెత్తాయి.మరి దీనికి ఆయన ఎలాంటి రెస్పాన్స్ ఇస్తాడో చూడాలి.