నగ్మా సినిమా ఇండస్ట్రీలో డైరెక్టర్లు హీరోయిన్లు పిండేయడం సర్వసాధారణం. అది డైరెక్షన్ పరంగా లేదా మరేదైనా కావచ్చు. కొందరు డైరెక్టర్లు సినిమాలో హీరోయిన్లు యాక్టింగ్ పరంగా పిండేస్తే .. మరికొందరు డైరెక్టర్లు ఇంకోరకంగా పిండుతారు. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కె రాఘవేంద్రరావు మాత్రం హీరోయిన్ నగ్మాను ఓ రేంజ్‌లో వాడేసుకున్నారట. ఎంతలా అంటే నగ్మా ఇక నేను రాఘవేంద్రరావు డైరెక్షన్లో సినిమాలు చేయను రా బాబోయ్ అన్నంతగా ఆమెను పిండేసాడట. ఇందులో అపార్ధాలకు తావులేదు.. ఇది నటనా పరంగా పిండుకున్నదే.
రకరకాల పండ్లను, పూలను హీరోయిన్ల బాడీ పార్ట్స్ పై వేసి స్పెషల్ అట్రాక్షన్ క్రియేట్ చేస్తారు. ఇప్పటివరకు రాఘవేంద్రరావు తన కెరీర్ లో 110 సినిమాలకు పైగా తెరకెక్కించారు. ఎంతోమంది హీరోయిన్లను చిత్ర పరిశ్రమకు పరిచయం చేశారు. ఆయన డైరెక్షన్లో ఎక్కువ సినిమాలు చేసింది మాత్రం అతిలోకసుందరి శ్రీదేవినే. శ్రీదేవి – రాఘవేంద్రరావు కాంబోలో సినిమా వస్తుందంటేనే ఓ రేంజ్ లో అంచనాలు ఉండేవి. ఇక హీరోయిన్ నగ్మా ని ఈ దర్శకుడు టార్చర్ పెట్టాడట.
రాఘవేందర్రావు డైరెక్షన్లో చిరంజీవి హీరోగా వచ్చిన ఘరానా మొగుడు సినిమాలో నగ్మా హీరోయిన్. ఈ సినిమా షూటింగ్ సమయంలో పాపం నగ్మాని రాఘవేందర్రావు చాలా ఇబ్బంది పెట్టేసాడట. మరి ముఖ్యంగా ఈ సినిమాలో వచ్చే ‘ఏందిబే ఎట్టాగా ఉంది ఒళ్ళు ‘.. అనే సాంగ్ షూటింగ్ టైంలో నగ్మని ఓ రేంజ్ లో ఆడుకున్నాడట రాఘవేంద్రరావు. ఈ పాటలో చీరపైకి ఎత్తి మాస్ స్టెప్పులు వేయడం నగ్మాకు పెద్దగా ఇష్టం ఉండేది కాదట. అయినా కానీ రాఘవేంద్రరావు దగ్గరుండి మరీ ఆమెతో మాస్ స్టెప్స్ వేయించారట. అంతేకాకుండా తాగుతూ తూలుతూ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వమంటూ నిజంగానే మందు తాగమని సజెస్ట్ చేశారట.