chota k naidu Harish shankar controversy : టాలీవుడ్ లో మరో ఫైట్.. చోటా గారు మళ్లీ కెలుక్కుంటే మర్యాదగా ఉండదంటూ హరీశ్ శంకర్ మాస్ వార్నింగ్

- Advertisement -

chota k naidu Harish shankar controversy టాలీవుడ్ లో మరో ఇద్దరు ప్రముఖుల మధ్య వార్ మొదలైంది. సీనియర్‌ కెమెరామెన్‌ చోటా కె నాయుడు,  డైరెక్టర్ హరీశ్ శంకర్ ల వివాదం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. తనపై చోటా చేసిన వ్యాఖ్యలపై హరీశ్ శంకర్ తీవ్రంగా స్పందించారు. ఎన్నోసార్లు ఆయన మీడియా ఎదుట తనను అవమానించారని, అయినా తాను మౌనంగా ఉన్నానని అన్నారు. కానీ ఇక తన ఓపిక నశించిందని, మరోసారి తనను కెలుక్కేంటే మర్యాదగా ఉండదంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇంతకీ ఈ ఇద్దరి మధ్య అసలేం జరిగింది?

సాధారణంగా సినీ ప్రముఖులు, సాంకేతిక నిపుణులు తాము పని చేసిన సినిమాల షూటింగుల్లో ఎదురైన అనుభవాలను ఏదో ఒక ఇంటర్వ్యూలో పంచుకుంటారు. తాజాగా కెమెరామెన్‌ చోటా కె నాయుడు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో హరీశ్‌ శంకర్‌ గురించి ప్రస్తావిస్తూ.. హరీశ్‌ శంకర్‌తో రామయ్యా.. వస్తావయ్యా చేశానని, తన టేకింగ్‌ స్టైల్‌లో తాను ఉండేవాడని, అస్తమానం అడ్డుపడుతుండేవాడని అన్నారు. చెప్పటానికి చాలాసార్లు ప్రయత్నించానని . కానీ, తను వినే మూడ్‌లో ఉండేవాడు కాదని అన్నారు. దర్శకులకు ఏవో ఆలోచనలు ఉంటాయి కదా!  వాళ్ల స్క్రిప్ట్‌ కరెక్ట్‌ అయి ఉండవచ్చంటూ చోటా కె అన్నారు. దీంతో హరీశ్‌ ఎక్స్‌(ట్విటర్‌) వేదికగా చోటాకు స్ట్రాంగ్ వార్నింగ్‌ ఇచ్చారు.

- Advertisement -

‘‘గౌరవనీయులైన చోటా కె నాయుడు గారికి నమస్కరిస్తూ… ‘రామయ్యా.. వస్తావయ్యా’ సినిమా వచ్చి దాదాపు దశాబ్దం దాటింది. ఈ పదేళ్లలో ఉదాహరణకి మీరు 10 ఇంటర్వ్యూలు ఇస్తే, నేను ఒక 100 ఇంటర్వ్యూలు ఇచ్చి ఉంటా. కానీ, ఎప్పుడూ ఎక్కడా మీ గురించి నేను తప్పుగా మాట్లాడలేదు. మీరు మాత్రం పలుమార్లు నా గురించి అవమానకరంగా మాట్లాడారు. మీకు గుర్తుందో, లేదో ఓ సందర్భంలో మిమ్మల్ని తీసేసి వేరే కెమెరామెన్‌తో షూటింగ్‌ చేద్దామన్న ప్రస్తావన వచ్చింది. కానీ, రాజుగారు చెప్పడం మూలంగానో ‘గబ్బర్ సింగ్‌ వచ్చాక పొగరుతో పెద్ద కెమెరామెన్‌ని తీసేస్తున్నాడు’ అని పదిమంది పలు రకాలుగా మాట్లాడుకుంటారని మధనపడుతూనే మీతో సినిమా పూర్తి చేశా. ఆ సినిమా ఆశించిన విజయం సాధించకున్నా ఏ రోజు ఆ నింద మీ మీద మోపలేదు. ఎందుకంటే ‘గబ్బర్ సింగ్’ వచ్చినప్పుడు నాది.. ‘రామయ్యా.. వస్తావయ్యా’ వస్తే అది నీది… అనే క్యారెక్టర్ కాదు నాది.

మీరు మాత్రం ఇంటర్వ్యూ చేసే వ్యక్తి అడగకపోయినా, నా ప్రస్తావన రాకున్నా, నాకు సంబంధం లేకున్నా, నా గురించి అవమానకరంగా మాట్లాడుతున్నారు. ఇలా చాలాసార్లు జరిగినా నేను మౌనంగానే బాధపడ్డా. కానీ, నా స్నేహితులు అవ్వచ్చు లేదా నన్ను అభిమానించే వాళ్ళు అవ్వచ్చు నా ఆత్మ అభిమానాన్ని ప్రశ్నిస్తుండడంతో ఈ మాత్రం రాయాల్సివస్తోంది.  మీతో పని చేసిన అనుభవం నన్ను బాధ పెట్టినా, మీకున్న అనుభవంతో మీనుంచి నేను కొన్ని విషయాలు నేర్చుకున్నాను. అందుకే మీరంటే ఇంకా నాకు గౌరవం ఉంది. దయచేసి ఆ గౌరవాన్ని కాపాడుకోండి. ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయండి. కాదు.. కూడదు.. మళ్లీ కెలుక్కుంటాను అని అంటే Any day.. Any Platform.. I AM Waiting… – భవదీయుడు హరీశ్‌ శంకర్‌’’ అని తన ఎక్స్‌ (ట్విటర్‌) ఖాతాలో ఈ సుదీర్ఘ లేఖను హరీశ్ శంకర్ పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఈ ఇద్దరి ఫైట్ ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here