Dil Raju : మేమనుకున్నది చేశాం.. అనుకున్న డబ్బులు వచ్చేశాయ్..దిల్ రాజు కామెంట్స్ పై నెటిజన్ల ఫైర్!

- Advertisement -

Dil Raju : విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఫ్యామిలీ స్టార్ సినిమా వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లోకి రాగా ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాకు బాగా కనెక్ట్ అవుతున్నారు. ఫ్యామిలీ స్టార్ కు ప్రేక్షకాదరణ దక్కుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ సినిమా ఆఫీస్ లో సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించగా ఈ కార్యక్రమంలో మహిళా ప్రేక్షకులు పాల్గొని ఫ్యామిలీ స్టార్ సినిమా టీమ్ మెంబర్స్ ను సత్కరించారు. ఈ సక్సెస్ మీట్ లో నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ ‘‘నిన్న మీడియా మిత్రుల కుటుంబాలతో కలిసి మా ఫ్యామిలీ స్టార్ సినిమా ప్రెస్ మీట్ నిర్వహించాం, సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురు చూశాం. ఉదయం నాలుగు గంటల నుంచే యూఎస్ నుంచి మెసేజ్ స్ రావడం మొదలైంది.

dil raju
dil raju

ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా థియేటర్స్ కు వెళ్తున్నారని చెప్పారు, హైదరాబాద్ లో మార్నింగ్ ఏడున్నరకు షోస్ మొదలయ్యాయి. నేను కూకట్పల్లి భ్రమరాంబ థియేటర్ లో సినిమా చూశా, 90 పర్సెంట్ యూత్ ఆడియన్స్ థియేటర్ లో ఉన్నారు. నేను ఏ ఏ సీన్స్ లో ఆడియన్స్ బాగా రెస్పాండ్ అవుతారు అనుకున్నానో అదే జరిగిందన్నారు. సినిమా మొదలైన పది నిమిషాల వరకు ప్రేక్షకులు సైలెంట్ గా ఉన్నారని, మృణాల్ ఎంట్రీ నుంచి రెస్పాన్స్ మొదలైందన్నారు. మొత్తంగా ఫ్యామిలీ స్టార్ సినిమా మేము టార్గెట్ చేసిన ఫ్యామిలీ ఆడియెన్స్ కు రీచ్ అయ్యింది, ఫ్యామిలీ ఆడియెన్స్ క్రౌడ్స్ గా థియేటర్స్ కి వెళ్తున్నారు.

- Advertisement -

మీడియా నుంచి వచ్చిన రివ్యూస్ ఒకలా ఉన్నాయి, సినిమా చూసిన ఫ్యామిలీ ఆడియెన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ వేరుగా ఉంది. వాళ్లలో 90 పర్సెంట్ మందికి ఫ్యామిలీ స్టార్ బాగా నచ్చింది, అందుకే సినిమా చూసిన ఫ్యామిలీ ఆడియెన్స్ మా టీమ్ కు సత్కారం చేస్తామంటే సంతోషంగా ఒప్పుకుని రమ్మని చెప్పామని అన్నారు. మేము ఇచ్చే స్టేట్ మెంట్స్ ను మీడియాలో ఎలా యాక్సెప్ట్ చేస్తుందో వాళ్లు రివ్యూస్ లో ఇచ్చే స్టేట్ మెంట్స్ ను మేము కూడా యాక్సెప్ట్ చేస్తాం, మీడియా షో చూశాక నాతో టచ్ లో ఉండే మీడియా ఫ్రెండ్స్ ఫోన్ చేసి ఫ్యామిలీతో ఫ్యామిలీ స్టార్ చూసి ఎంజాయ్ చేశామని’’ చెప్పారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here