Salaar Movie : ఈ ఏడాది టాలీవుడ్ లో డబ్బింగ్ సినిమాల హవానే ఎక్కువగా నడిచింది. ఆడియన్స్ ఈ డబ్బింగ్ సినిమాలను నెత్తిన పెట్టుకొని మరీ చూసారు. కొంతమంది పేరున్న స్టార్ హీరోల సినిమాలకంటే కూడా ఈ డబ్బింగ్ సినిమాలకే ఎక్కువ వసూళ్లు వస్తున్నాయి. నిర్మాతలు మరియు బయ్యర్స్ కూడా డబ్బింగ్ సినిమాలపై అమితాసక్తిని చూపిస్తున్నారు. ఎలాంటి పెద్ద సినిమాలు విడుదల లేనప్పుడు డబ్బింగ్ చిత్రాలను విడుదల చేసుకోవడం లో తప్పే లేదు.

ఇది వ్యాపారం కాబట్టి సర్దుకోవచ్చు. కానీ మన టాలీవుడ్ ప్రెస్టీజియస్ సినిమాలు విడుదల అవుతున్న సమయం లో కూడా డబ్బింగ్ చిత్రాలను బడా నిర్మాతలు ప్రోత్సహించడం ఆశ్చర్యాన్ని కలుగచేస్తుంది. ఈ డిసెంబర్ 22 వ తారీఖున ప్రభాస్ హీరో గా నటించిన అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘సలార్’ విడుదలకు సిద్ధం గా ఉంది. ఈ సినిమా కోసం కేవలం టాలీవుడ్ ఆడియన్స్ మాత్రమే కాదు, ఇండియా మొత్తం ఎదురు చూస్తుంది.

కానీ అదే రోజున బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ ‘డుంకీ’ చిత్రం కూడా విడుదల అవ్వబోతుంది. ఇది కూడా క్రేజీ కాంబినేషన్ సినిమానే. అయితే మన టాలీవుడ్ నుండి ఇంత పెద్ద క్రేజీ మూవీ విడుదల అవుతున్నప్పుడు, దిల్ రాజు ఎందుకు డబ్బింగ్ సినిమా కొనుక్కొని, ‘సలార్’ కి అడ్డు రావాలని చూస్తున్నాడు అనే దానిపై కక్ష్య సాధింపులు ఉన్నాయని అంటున్నారు ఇండస్ట్రీ కి చెందిన కొంతమంది ముఖ్యులు. కారణం ఏమిటంటే ‘సలార్’ నైజాం ప్రాంతం హక్కుల కోసం దిల్ రాజు ప్రయత్నాలు చేసాడు.

కానీ ఆయన అడిగిన రేట్ కి నిర్మాతలు సినిమాని అమ్మడానికి సిద్ధం గా లేరు. మరో టాప్ ప్రొడక్షన్ హౌస్ ‘మైత్రీ మూవీ మేకర్స్’ ఎంత అడిగితే అంత ఇవ్వడానికి సిద్ధం గా ఉన్నారు కాబట్టి వాళ్ళకే అమ్మేసారు. అందుకే దిల్ రాజు మనసులో ఆ కక్ష్య పెట్టుకొని ‘డుంకీ’ చిత్రాన్ని కొనుగోలు చేసాడని టాక్. ఇప్పుడు నైజాం లో దిల్ రాజు కారణంగా ‘సలార్‘ చిత్రానికి 300 థియేటర్స్ మరియు భారీ స్థాయి మల్టీప్లెక్స్ షోస్ తగ్గనున్నాయి. డబ్బింగ్ సినిమా కోసం దిల్ రాజు చేస్తున్న ఈ చర్య పై సోషల్ మీడియా లో నెటిజెన్స్ మరియు ప్రభాస్ ఫ్యాన్స్ విరుచుకుపడుతున్నారు.