సమంత ప్రధాన పాత్రలో గుణశేఖర్ దర్శకత్వం లో తెరకెక్కిన ‘శాకుంతలం’ అనే చిత్రం ఈమధ్యనే విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరమైన డిజాస్టర్ గా నిలిచినా సంగతి తెలిసిందే.ఈ చిత్రానికి నిర్మాత దిల్ రాజు సహనిర్మాతగా వ్యవహరించగా, దర్శకత్వం వహించిన గుణశేఖర్ మరో నిర్మాతగా వ్యవహరించాడు.సుమారుగా 60 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ పెట్టి ఈ సినిమాని తీస్తే ఫుల్ రన్ లో కనీసం 5 కోట్ల రూపాయిల షేర్ ని కూడా రాబట్టలేక పోయింది.

వరుస హిట్స్ తో దూసుకుపోతున్న దిల్ రాజు కి పెద్ద స్పీడ్ బ్రేకర్ లాగ నిల్చింది ఈ చిత్రం.మరో పక్క ‘యశోద’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తో మంచి ఊపు మీదున్న సమంత కి కూడా ‘శాకుంతలం’ చిత్రం మింగుడుపడని ఫలితంగా చెప్పుకోవచ్చు.ఇది ఇలా ఉండగా రీసెంట్ గా దిల్ రాజు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో సమంత గురించి చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.

ఆయన మాట్లాడుతూ ‘నా పాతికేళ్ల కెరీర్ లో శాకుంతలం తెచ్చిన నష్టాలను ఏ సినిమా కూడా తీసుకొని రాలేదు.సమంత తో గతం లో నేను చేసిన ‘జాను’ అనే చిత్రం కూడా డిజాస్టర్ అయ్యింది’ అంటూ దిల్ రాజు చెప్పుకొచ్చాడు.అంటే ఆయన పరోక్షంగా సమంత తో చేసిన రెండు సినిమాలు ఘోరంగా డిజాస్టర్ అయ్యాయి, ఇక ఆమె వైపు లేడీ ఓరియెంటెడ్ సినిమాల కోసం చూడము అని చెప్పినట్టు అయ్యింది.

‘శాకుంతలం’ చిత్రం 5 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబడితే,అంతకు ముందు ఆయన సమంత తో తీసిన ‘జాను’ అనే చిత్రం 8 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది.అయితే నష్టం పరంగా దిల్ రాజు ‘శాకుంతలం’ కి భారీ గా కోల్పోయాడు.మరి భవిష్యత్తులో ఆయన సమంత తో సినిమాలు చేస్తాడో లేదో చూడాలి.
