Chiranjeevi : తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అప్పటికీ, ఇప్పటికీ ఎవర్ గ్రీన్ మెగాస్టార్ అంటే అది చిరంజీవి మాత్రమే. తన తరం లోని స్టార్ హీరోలతో మాత్రమే కాకుండా, తర్వాతి తరం స్టార్ హీరోలతో కూడా పోటీ పాడడం మెగాస్టార్ చిరంజీవి స్టైల్. అందుకే నాలుగు దశాబ్దాల నుండి ఆయన నెంబర్ 1 స్థానం లో కొనసాగుతూనే ఉన్నాడు.
రీ ఎంట్రీ తర్వాత మెగాస్టార్ ఏకంగా మూడు సార్లు వంద కోట్ల రూపాయిల షేర్ మార్కు ని అందుకున్నాడు. టాలీవుడ్ లో చాలా మంది స్టార్ హీరోలు ఇంకా వంద కోట్ల రూపాయిల క్లబ్ లోకి చేరలేదు. ఇదంతా పక్కన పెడితే ఒక్కప్పుడు మెగాస్టార్ చిరంజీవి కి ఉన్న క్రేజ్ ప్రస్తుతం లేదని చెప్పడం లో మాత్రం ఎలాంటి సందేహం లేదు, ట్రేడ్ సైతం ఇది ఒప్పుకుంటుంది. ఒకప్పుడు చిరంజీవి సినిమాకి టాక్ తో సంబంధం లేకుండా ఓపెనింగ్ వసూళ్లు వచ్చేవి.
కానీ ఇప్పుడు మాత్రం ఆ పరిస్థితి లేదు, చిరంజీవి సినిమాలకు టాక్ లేకపోతే చాలా దారుణంగా వసూళ్లు దెబ్బ తింటున్నాయి. ఉదాహరణకి తీసుకుంటే ‘ఆచార్య’ మరియు ‘భోళా శంకర్’ చిత్రాలు. ఈ రెండు సినిమాలు చిరంజీవి కెరీర్ లోనే ఘోరమైన డిజాస్టర్స్ గా నిలిచాయి. అయితే ఫ్లాప్స్ అవుతున్నప్పటికీ కూడా చిరంజీవి రెమ్యూనరేషన్ విషయం లో ‘తగ్గేదేలే’ ధోరణితో వ్యవహరిస్తున్నాడని ఇండస్ట్రీ లో టాక్.
అసలు విషయం లోకి వెళ్తే అనిల్ రావిపూడి దర్శకత్వం లో మెగాస్టార్ చిరంజీవి సినిమా ఈమధ్యనే ఫిక్స్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమాకి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. అయితే ప్రతీ విషయం లో చాలా లెక్కలు చూసుకునే దిల్ రాజు చిరంజీవి కోరిన 70 కోట్లు ఇచ్చే పరిస్థితి లేదని, మెగాస్టార్ క్రేజ్ ఇప్పుడు బాగా తగ్గింది అని, రెమ్యూనరేషన్ మరియు భారీ బడ్జెట్ పెట్టేంత స్కోప్ లేదని తెగేసి చెప్పాడట. ఇది ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.