Kalki 2898 AD : పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ కల్కి.. ఈ సినిమా గత నెలలో విడుదలైంది.. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లతో దూసుకుపోతుంది.. 5 రోజుల్లోనే 700 కోట్లు క్రాస్ చెయ్యడం మామూలు విషయం కాదు.. ఇప్పటికి ఊచకొత కొనసాగుతుంది.. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో ఈ సినిమాలోని క్యారెక్టర్స్ కు మంచి పేరు వచ్చింది.. ముఖ్యంగా అమితాబ్ వన్ మ్యాన్ షో అయ్యింది.. ఇకపోతే ఈ సినిమాలో ఎవరు గమనించని నాలుగు విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ సినిమాలో భైరవగా కనిపించాడు ప్రభాస్. అతనొక బౌంటీ హంటర్. క్రెడిట్స్‌ని సంపాదించడం కోసం ఏదైనా చేసేందుకు సిద్ధపడతాడు. ఆ క్రెడిట్స్‌తో ధనవంతులు ఉండే ‘కాంప్లెక్స్’కి వెళ్లాలన్నది భైరవ అసలు ఉద్దేశం. ఇక ఈ భైరవ ఒక మల్టీటాలెంటెడ్ వ్యక్తి. ఒక రోబోను సొంతంగా క్రియేట్ చేసుకుంటాడు. తన గోల్‌ని సాధించుకునేందుకు ఎంత దూరమైన వెళతాడు.. ఏదైన చేస్తాడు.. ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ కూడా ఇలాంటివే భైరవలాగే, ఈ తరహా మ్యూచువల్ ఫండ్స్ కూడా అవకాశం కోసం ఎదురుచూస్తుంటాయి. మార్కెట్ క్యాపిటలైజేషన్‌తో సంబంధం లేదు.
ఇక దీపిక పదుకొణె నటించిన క్యారెక్టర్ పేరు సుమతి. ఆమె ప్రెగ్నెంట్. ఆమె కడుపులో దేవుడు ఉన్నాడని, మానవజాతిని ఆ బిడ్డ రక్షిస్తుందన్నది నమ్మకం.. దేవుడుగా త బిడ్డ వస్తాడని ఆమె బలంగా నమ్ముతుంది.. ఆమె వెంట చాలా మంది సహాయం చేస్తారు..
అలాగే అశ్వద్ధామగా అమితాబ్ బచ్చన్ నటనకు మంచి ప్రశంసలు లభించాయి. సమతికి రక్షకుడిగా, భైరవతో పెద్ద యుద్ధమే చేస్తాడు. ప్రపంచానికి రక్షకుడు ఎప్పుడు కావాలో, అప్పటివరకు ఎదురుచూసి తన పని మొదలుపెడతాడు.. మనం కోరుకునే టార్గెట్స్ నెరవేరాలంటే, వాటి మీద మనకు నమ్మకం కలగాలంటే, లార్జ్ క్యాప్స్పైనే ఫోకస్ చేయాలి. వాటికి ఉన్న సహనం అంతా ఇంతా కాదు.. ఒకవేళ అంతా అనుకున్న విధంగా జరిగితే మాత్రం మంచిగా సంపాదించుకోవచ్చు..
చివరగా కాంప్లెక్స్.. కాంప్లెక్స్‌కి వెళ్లేందుకు భైరవ చాలా సాహసం చేస్తాడు. తన పర్సనల్ గోల్స్‌ని నెరవేర్చుకునేందుకు ఎంతైనా కష్టపడాడు. కాంప్లెక్స్‌లో సుఖంగా ఉండొచ్చు అనే ఇదంతా చేస్తాడు.. అతనిలాగ మనం ఉండాలి.. భవిష్యత్ కోసం ఆలోచిస్తే మనకు ఎటువంటి లోటు ఉండదు.. ఇలా ఒక్కో పాత్ర ఒక్కో విషయాన్ని చెబుతుంది.. మొత్తానికి సినిమా మొత్తం మెసేజ్ ఓరియేంటెడ్..